Home Cinema Kamal Haasan : కల్కి 2898 AD సినిమాలో తన పాత్రపై ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసిన...

Kamal Haasan : కల్కి 2898 AD సినిమాలో తన పాత్రపై ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసిన కమల్..

Kamal Haasan : హీరో ప్రభాస్ అంటే తెలియని వారు ఉండరు. ఈయన టాలీవుడ్ లో రెండు దశాబ్దాలుగా స్టార్ హీరో పోసిషన్ లో ఉన్నారు. ఈయన నటించిన బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా నిలదొక్కుకోగలిగాడు ప్రభాస్. ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ తదుపరి చిత్రం కల్కి 2898 AD. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ చిత్రాన్ని అందరు లెజెండరీ నటులతో తీయాలని మేకర్స్ ప్లాన్ చేసారు. ఈ సినిమాలో కొన్ని సర్ ప్రైజ్ లు కూడా ఫాన్స్ కోసం ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు స్టార్ హీరోస్ కమల్ హాసన్ మరియు అమితాబ్ బచ్చన్. అయితే ప్రస్తుతం కమల్ హాసన్ తాజాగా కల్కి సినిమాపై ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. కల్కి 2898.ఏడి లాంటి సినిమాలు నేను నా కెరీర్ లో చూడలేదు. ఇలాంటి సినిమాలో నటించడం చాలా ఆసక్తికరంగా ఉంది.

kamal-haasan-interesting-words-about-kalki-2898-ad-cinema

నా 230+ సినిమాల్లో నేనెప్పుడూ ఇలాంటి సినిమాలో నటించలేదని చెప్పారు. కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ప్రభాస్ సరసన దీపికా పదుకొణె, దిశా పటాని హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబందించిన 15 నిమిషాల నేరేషన్ ను హాట్స్టార్ లో అనిమే రూపంలో విడుదల చేసారు. ఇందులో బ్రహ్మానందం కీలక పాత్రలో పోషించాడు.

Exit mobile version