Home Cinema Venu Swamy : వేణు స్వామి సంచలన నిర్ణయం.. నేటిన్ట్లో వీడియో హల్చల్..

Venu Swamy : వేణు స్వామి సంచలన నిర్ణయం.. నేటిన్ట్లో వీడియో హల్చల్..

venu-swamy-sensational-decision-announced-by-posting-a-video-saying-he-quits-astrology-prediction

Venu Swamy : తెలుగు ప్రజలకు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సుపరిచితుడే. ఈయన అప్పట్లో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన సమంత మరియు నాగచైతన్య డివోర్స్ తీసుకుంటున్నారు అని ముందుగానే చెప్పాడు. ఇది నిజం అవ్వడంతో వేణు స్వామి ఫేమస్ అయిపోయాడు. అప్పటి నుండి ఈయన టీవీ చానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ నటి నటులపై సంచలన కామెంట్స్ చేసేవాడు. దీనితో వేణు స్వామి పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోయేది. ఈయన స్టార్ హీరోయిన్లతో పూజలు కూడా చూపిస్తూ ఉండే వాడు.

అయితే ఇటీవల ఇంటర్నెట్ లో వేణు స్వామి మీద బారి ట్రోలింగ్ జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే, ఆంధ్ర ఎన్నికల ఫలితాల గురించి వేణు స్వామి చెప్పిన ప్రిడిక్షన్ ఏ కారణం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈయన ఈసారి పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ సీట్లు తగ్గుతాయని మరియు ఆంధ్రలో మల్లి జగన్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. కానీ తీరా ఎన్నికల రిజల్ట్స్ చుస్తే, వైస్సార్సీపీ దిక్కులేకుండా పోయింది. ఈసారి ఆంధ్ర ముఖ్యమంత్రి గా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

అయితే వేణు స్వామి అంత ఫేక్ ముచ్చట్లు చెపుతాడు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ల్స్ చేస్తున్నారు నెటిజనులు. దీనికి వేణు స్వామి స్పందిస్తూ ఓ వీడియో ను విడుదల చేసారు. ఆ వీడియోలో వేణు స్వామి నేను చెప్పిన ప్రిడిక్షన్ వంద శాతం తప్పు అవ్వడంతో నేను ఇకపై ప్రిడిక్షన్ చెప్పడం మానేస్తా అని ఆ వీడియో లో తెలిపారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మిడియాలో హల్చల్ చేస్తుంది. వేణు స్వామి మంచి నిర్ణయం తీసుకున్నారు అంటూ నెటిజనులు కామెంట్స్ కూడా పెడుతున్నారు.

Exit mobile version