Home Cinema Premi Viswanath : వంటలక్క కొడుకును చూసారా.. హీరోలా ఉన్నాడు..

Premi Viswanath : వంటలక్క కొడుకును చూసారా.. హీరోలా ఉన్నాడు..

Premi Viswanath : ప్రేమి విశ్వనాథ్, ఈ పేరు చెపితే ఎవరో గుర్తుకు రావడానికి కొంత సమయం పడుతుంది. కానీ అదే వంటలక్క అంటే తెలుగు ప్రజలు ఇట్టే గుర్తుపడతారు. తెలుగు బుల్లితెరపై మెగాహిట్ సీరియల్స్ లిస్ట్ కార్తీకదీపం టాప్ లో ఉంటుంది. టీఆర్పీ రేటింగ్ విషయానికొస్తే, పెద్ద హీరోల చిత్రాలను కూడా కార్తీక దీపం అధిగమించింది. 2017 నుండి 2023 వరకు, కార్తీకదీపం నంబర్ వన్ షో గా నిలిచింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కార్తీకదీపం 2 కూడా 2024లో ప్రారంభమైంది.

ఆ సీరియల్ లో చెఫ్‌గా నటించిన మలయాళ నటి ప్రేమి విశ్వనాథ్ తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కథానాయిక రంగంలో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ప్రేమి విశ్వనాథ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి మనం ఇక్కడ తెలుసుకుందాం. ఈమె డా. టి.ఎస్. వినీత్ భట్ అనే జ్యోతిష్యుడిని వివాహం చేసుకుంది. ఈ దంపతుల ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అతని పేరు మనుజీత్.

kartika-deepam-serial-fame-premi-viswanath-son-photos-are-going-viral-on-INTERNET

అయితే తాజాగా మనుజీత్ తన తల్లి ప్రేమి విశ్వనాథ్‌తో కలిసి ఓ వీడియో చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఈ రీల్ చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. సిక్స్ ప్యాక్ ఫిజిక్‌తో ఆరు అడుగుల ఎత్తు, ఫిట్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు మనుజీత్. మనుజిత్ వంటలక్క కొడుకు అంటే ఎవరు నమ్మడంలేదు. ఎందుకంటే ఈ ఇద్దరు తల్లీ కొడుకుల కంటే అక్క తమ్ముడిలా ఉన్నారు. ఇంటర్నెట్ వినియోగదారులు ఇదే విషయాన్ని చర్చించుకుంటున్నారు. కామెంట్లు చేస్తూ వంటలక్క ను సంతూర్ మామ్ అని అంటుంటారు.

Exit mobile version