Thursday, September 19, 2024
HomeCinemaSharmiela Mandre: ఈ హీరోయిన్ గుర్తుందా.. ఇంత అందంగా తయారయింది ఏంటి..

Sharmiela Mandre: ఈ హీరోయిన్ గుర్తుందా.. ఇంత అందంగా తయారయింది ఏంటి..

Sharmiela Mandre : అందం, టాలెంట్ రెండు ఉన్నా హీరోయిన్స్ మన టాలీవుడ్ ఇండస్ట్రీ కి దొరకడం చాలా కష్టం. ఒకరికి అందం ఉంటే టాలెంట్ ఉండదు, మరొకరికి టాలెంట్ ఉంటే అందం ఉండదు, మన దురదృష్టం కొద్దీ వీళ్ళే ఇప్పుడు ఇండస్ట్రీ లో టాప్ స్టార్ హీరోయిన్స్ గా చలామణి అవుతున్నారు. కానీ అన్నీ పర్ఫెక్ట్ గా ఉన్న కొంతమంది హీరోయిన్స్ మాత్రం కనుమరుగు అయిపోతున్నారు. అలాంటి హీరోయిన్స్ లో ఒకరైన షర్మిలా మండ్రే(Sharmiela Mandre) గురించే నేడు మనం మాట్లాడుకోబోతున్నాము. అల్లరి నరేష్ తన సినిమాలు బాగున్నా, బాగాలేకపోయినా టాలీవుడ్ కి ఎంతో అందమైన అమ్మాయిలను పరిచయం చేస్తూ ఉంటాడు.

కానీ డైరెక్టర్స్ పెద్దగా వాళ్ళని పట్టించుకోరు. అలా షర్మిల మండ్రే ని కూడా పట్టించుకోలేదు. ఈమె కెవ్వు కేక చిత్రం ద్వారా ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఒక మోస్తరు గా ఆడినా కూడా ఈమెకి మన టాలీవుడ్ లో అవకాశాలు పెద్దగా పలకరించలేదు. బెంగళూరులో పుట్టి పెరిగిన షర్మిల, అక్కడే సినిమా అవకాశాల కోసం తెగ ప్రయత్నాలు చేసింది. అలా ‘సాజ్ని’ అనే చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసిన ఆమె, ఆ తర్వాత 2012 వ సంవత్సరం లో ‘మిత్తరల్’ అనే తమిళ చిత్రంలో హీరోయిన్ గా నటించింది.

అలా మన టాలీవుడ్ లో అల్లరి నరేష్ కంటపడి ‘కెవ్వు కేక’ చిత్రంతో మనల్ని పలకరించింది. అదృష్టం కలిసి రాలేదు. దీంతో ఆమె మళ్ళీ కన్నడ సినీ పరిశ్రమకి వెళ్ళిపోయింది. అక్కడే బలంగా సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేసి స్టార్ హీరోల చిత్రాలలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది. అలా అతి తక్కువ సమయంలోనే కన్నడ స్టార్ హీరోయిన్స్ లీగ్ లోకి అడుగుపెట్టిన ఈమె డబ్బులు కూడా బాగానే సంపాదించింది. ఒక ప్రొడక్షన్ హౌస్ ని స్థాపించి నిర్మాతగా కూడా రాణించిన ఈ హాట్ బ్యూటీ ప్రస్తుతం ‘అదిరాష్టశాలి’ అనే కన్నడ చిత్రం లో నటించింది.

షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అతి త్వరలోనే మన ముందుకు రాబోతుంది. సోషల్ మీడియా లో ఎల్లప్పుడూ యాక్టీవ్ గా ఉండే ఈమె, ఇంస్టాగ్రామ్ లో రీసెంట్ గా అప్లోడ్ చేసిన కొన్ని ఫోటోలు తెగ వైరల్ గా మారింది. అందులో హాట్ గా బ్లూ సారీ తో చూపులు తిప్పుకోలేని అందంతో కనిపిస్తున్న షర్మిల లేటెస్ట్ ఫొటోస్ చూసి మనసు పడని అబ్బాయి అంటూ ఉండరేమో.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts