Home Cinema Kiara Advani : నటి కియారా అద్వానీ ధరించిన నెక్లెస్ ధర ఎంతో తెలిస్తే మతిపోతుంది..

Kiara Advani : నటి కియారా అద్వానీ ధరించిన నెక్లెస్ ధర ఎంతో తెలిస్తే మతిపోతుంది..

Kiara Advani : ఇటీవల పలువురు సినీ తారలు మెడలో వేసుకునే నెక్లెస్ ల ధరలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల, బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా రోమ్‌లో జరిగిన బల్గారీ ఈవెంట్‌లో సుమారు రూ. 358 కోట్ల విలువైన 140 క్యారెట్ల స్వచ్ఛమైన డైమండ్ నెక్లెస్‌ను ధరించి వెలుగులోకి వచ్చింది. అయితే తాజాగా మరో హీరోయిన్ మెడలో మిలియన్ డాలర్ల హారం వేసుకుంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు, ప్రస్తుతం సౌత్ మరియు నార్త్ సినిమా ఇండస్ట్రీని వరుస సినిమాలతో షేక్ చేస్తున్న కియారా అద్వానీ.

కియారా ఇటీవల కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైన సంగతి తెలిసిందే. అయితే, ఒక ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైనప్పుడు, కియారా అద్వానీ తన మెడలో దాదాపు 30 కోట్ల రూపాయల విలువైన డైమండ్ నెక్లెస్‌ను ధరించడంతో అందరి దృష్టి తన మీదకు మళ్లింది. కియారా అద్వానీ మెడలో వేసుకున్న నెక్లెస్ ఇటాలియన్ జ్యువెలరీ కంపెనీకి చెందిన చియారా బల్గారీ నెక్లెస్. ఈ నెక్లెస్ పసుపు రంగుల్లో ఉన్న డైమండ్ రాళ్లతో కలిగి ఉంటుంది.

kiara-advani-necklace-cost-will-blow-mind

ఈ ఈవెంట్‌లో కియారా అద్వానీ యువరాణిలా కనిపించింది. తన మెడలో డైమండ్ నెక్లెస్‌తో అందరినీ ఆకర్షించింది. కాబట్టి చాలా మంది ఆమె మెడలో ధరించిన నెక్లెస్ ధర గురించి ఆరా తీయడం ప్రారంభించారు. ఈ నెక్లెస్ ధర 30 కోట్లు అని తెలియగానే సామాన్యులు నోరెళ్లబెడుతున్నారు. ఈ 30 కోట్లతో ఎన్నో కుటుంబయలు జీవితాంతం కరవు లేకుండా ఆనందంగా బ్రతుకుతాయి అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Exit mobile version