Home Cinema Shivani : ఈ యంగ్ హీరోను డేట్ చేస్తున్న శివాని రాజశేఖర్.. పెళ్లి కూడా చేసుకోబోతున్నారు..

Shivani : ఈ యంగ్ హీరోను డేట్ చేస్తున్న శివాని రాజశేఖర్.. పెళ్లి కూడా చేసుకోబోతున్నారు..

Shivani : సౌత్ ఇండస్ట్రీలో యాంగ్రీ మ్యాన్ గా పేరు తెచ్చుకున్న రాజశేఖర్ తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోగా వెలిగిపోయాడు. అయితే అప్పట్లో ఈయన నటి జీవిత ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వీరికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. రాజశేఖర్ తన ఇద్దరు కూతుళ్లను కూడా సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. రాజశేఖర్ కూతురు శివాని ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది. అయితే తాజాగా ఈ క్యూటీ ఈ యంగ్ హీరోతో ప్రేమలో పడిందని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి.

హీరోతో ఈ యంగ్ బ్యూటీ వరుస సినిమాలు చేయడమే ప్రధాన కారణం. ఆ కుర్ర హీరో మరెవరో కాదు రాహుల్ విజయ్. ఈ జంట కోటబొమ్మాళి పిఎస్ మరియు విద్యా వాసుల అహం అనే రెండు చిత్రాలలో కలిసి పనిచేశారు. అయితే ఇటీవల శివాని రాజశేఖర్ తన సోషల్ మీడియా కాతాలో ఓ రెండు చిత్రాలను పోస్ట్ చేసింది. ఆ ఫోటోల వల్లనే ఈ వార్తలు నేటిన్ట్లో గుప్పు మంటున్నాయి. అయితే శివాని తన ఇంస్టాగ్రామ్లో హీరో రాహుల్ విజయ్‌తో ఉన్న చిత్రాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు.

rajashekar-daughter-shivani-dating-young-hero

ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి మరియు చాలా మంది ఈ చిత్రాలకు కామెంట్ల వర్షాన్ని కురిపియడం ప్రారంభించారు. కొందరు అయితే వీరిద్దరి మధ్య ఎదో నడుస్తుంది అంటూ అంటున్నారు. వీరిద్దరూ కూడా వరుసగా కలిసి పలు చిత్రాల్లో నటించడం ఈ వార్తలకు కారణం. ఇటీవల రాహుల్ విజయ్ గురించి ఓ ఇంటర్వ్యూలో శివాని రాజశేఖర్ మాట్లాడుతూ విజయ్‌కి తనకు ఎలాంటి సంబంధం లేదని, ఈ హీరో చిన్నప్పటి నుంచి తనకు తెలుసని చెప్పింది. విద్యా వాసుల అహం సినిమాలో శివాని, రాహుల్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది.

Exit mobile version