Friday, August 23, 2024
HomeCinemaKiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమాకు వింత టైటిల్.. దాని అర్ధం ఏంటో...

Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమాకు వింత టైటిల్.. దాని అర్ధం ఏంటో తెలుసా..

Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరో గా నిలదొక్కుకోగలిగాడు. కిరణ్ తన కథలను ఎంచుకోవడంలో దిట్ట. ప్రస్తుతం అతని చేతి నిండా సినిమాలే. అయితే ఈయన నటిస్తున్న ఓ చిత్రం టైటిల్ రెవీల్ చేసారు చిత్ర యూనిట్. ఆ సినిమా గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం పదండి. కిరణ్ సబ్బవరం లేటెస్ట్ సినిమాకు “కా” అనే పేరు పెట్టారు. ఈ సినిమా ఓ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అని చిత్ర బృందం తెలిపారు.

ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే ప్రస్తుతం ఇంటర్నెట్ లో ఈ సినిమా టైటిల్ గురించి చర్చ జరుగుతుంది. క అంటే కిరణ్ అబ్బవరం అని సోషల్ మీడియాలో అందరు అంటున్నారు. “క” అనే టైటిల్ కథకి బాగా రిలేట్ అవుతుంది అని తెలిపారు దర్శకులు. చిత్ర నిర్మాణ బృందం ఈరోజు టైటిల్‌ను అధికారికంగా ప్రకటించింది. సుజీత్, సందీప్ అనే ఇద్దరు దర్శకులు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. నిర్మాత చింతా గోపాల్ కృష్ణా రెడ్డి క అనే సినిమాను నిర్మిస్తున్నారు.

kiran-abbavaram-new-cinema-titled-as-ka-first-look-is-out-and-do-you-the-meaning

ఈ సందర్భంగా టైటిల్‌తో పాటు ప్రివ్యూ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. కిరణ్ లుక్ ను ఇంకా పూర్తిగా రివీల్ చేయలేదు కానీ, ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే ఖచ్చితంగా ఈసారి కిరణ్ లుక్ కొత్తగా ఉంటుందని అనిపిస్తుంది. ఈ చిత్రానికి శ్యామ్ సి సంగీతం అందిస్తున్నారు. వీక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే కథ అని, పాత్రలు, వారి ప్రవర్తన షాకింగ్‌గా ఉంటాయని చిత్రబృందం పేర్కొంది. కిరణ్ అబ్బవరం నటించిన దిల్ రుబా చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా విడుదలైన తర్వాత “క” ప్రేక్షకుల ముందుకు రానుంది.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts