Home Cinema Krithi Shetty : అది పెంచుకోవటం కోసం మందులు వాడుతున్న కృతి శెట్టి..

Krithi Shetty : అది పెంచుకోవటం కోసం మందులు వాడుతున్న కృతి శెట్టి..

Krithi Shetty Using Medicine : కేవలం ఒకే ఒక్క సినిమాతో అద్భుతమైన పాపులారిటీ మరియు క్రేజ్ ని సంపాదించుకున్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో కృతి శెట్టి పేరు ముందు వరుసలో ఉంటుంది. ‘ఉప్పెన’ సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కృతి శెట్టి, ఆ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో ఈమెకి టాలీవుడ్ లో అవకాశాలు క్యూ కట్టాయి. ఇంకా పెద్ద స్టార్ హీరోల సరసన నటించే రేంజ్ కి అయితే రాలేదు కానీ, కుర్ర హీరోలు మాత్రం తమ సినిమాల్లో ఈమెని హీరోయిన్ గా పెట్టుకునేందుకు ఎగబడుతున్నారు.

krithi-shetty

ఉప్పెన చిత్రం తర్వాత ఈమె హీరోయిన్ గా నటించిన ‘శ్యామ్ సింగ రాయ్’ మరియు ‘బంగార్రాజు’ వంటి సినిమాలు మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్స్ గా నిలిచాయి. కానీ మిగతా సినిమాలన్నీ మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ అయ్యాయి. అయినప్పటికీ కూడా ఈమెకి టాలీవుడ్ లో అవకాశాలు తగ్గడం లేదు. అలా ఎన్ని ఫ్లాప్స్ వచ్చిన సినిమాల్లో అవకాశాలు రావడానికి కారణం యూత్ లో ఈమెకి ఉన్న క్రేజ్ అని అంటున్నారు విశ్లేషకులు. చూడచక్కని అందం తో అద్భుతమైన అభినయం తో తనకంటూ మొదటి సినిమాతోనే ఒక ఇమేజిని క్రియేట్ చేసుకుంది.

అయితే ఆమె ఇంత అందం తో ఉండడానికి కారణం ఆమె వయస్సు కనపడకుండా ఉండేందుకు, ముఖం లో గ్లో పెరిగేందుకు ప్రత్యేకంగా వాడుతున్న మెడిసిన్స్ అని తెలుస్తుంది(Krithi Shetty Using Medicine). గూగుల్ చూపిస్తున్న వివరాల ప్రకారం కృతి శెట్టి వయస్సు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే, కానీ ఆమె వయస్సు అబద్దం అని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్న వార్త. ఆమె వయస్సు 24 సంవత్సరాలకు తక్కువ ఉండదని, తన వయస్సు ని కప్పి పుచ్చుకోవడానికి కావాలని తక్కువ వయస్సు ఉన్నట్టుగా చెప్తుందని, అలా కనిపించేందుకు ఆమె మెడిసిన్ వాడడమే అందుకు ఉదాహరణ అని నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.

ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో తెలియదు కానీ, ఒకవేళ నిజం అయ్యినప్పటికీ కూడా ఇందులో కృతి శెట్టి తప్పు ఏమాత్రం లేదనే చెప్పాలి. ఇండస్ట్రీ లో మనుగడ సాగించాలంటే టాలెంట్ మాత్రమే ఉంటే సరిపోదు, అందం గా కూడా ఉండాలి, అప్పుడే ఒక హీరోయిన్ కెరీర్ కాలం దశాబ్దం కి పైగా ఉంటుంది , అందుకు కావాల్సిన ఏ చర్యలు చేపట్టినా తప్పు కాదని అంటున్నారు కృతి శెట్టి ఫ్యాన్స్. కృతి శెట్టి ప్రస్తుతం జీనీ అనే తమిళ సినిమాలో నటిస్తుంది. ఈ విడుదలకి రెడీగా ఉంది. ఈ సినిమాకి భువనేశ్ అర్జునన్ దర్శకత్వం వచ్చిందడు.

Exit mobile version