Kriti Kharbanda: కొంతమంది హీరోయిన్లు ఎంత అందంగా ఉన్నప్పటికీ సరైన అవకాశాలు దక్కవు. ప్రతీ ఏడాది కుర్ర హీరోయిన్స్ ఎంట్రీ ఇవ్వడం, దర్శక నిర్మాతలు ఎక్కువగా ఆ కుర్ర హీరోయిన్స్ కి మొగ్గు చూపడం వల్ల స్టార్ హీరోయిన్ అయ్యేందుకు అన్నీ అర్హతలు ఉన్న హీరోయిన్స్ కొంతమంది ఫేడ్ అవుట్ ఐపోతున్నారు. అందుకే హీరోయిన్ కెరీర్ చాలా తక్కువ స్పాన్ లో ఉంటుంది అని దర్శక నిర్మాతలు అంటుంటారు. అదృష్టం కలిసొచ్చి కేవలం కొంత మంది హీరోయిన్స్ మాత్రమే దశాబ్దాలు కొనసాగుతుంటారు. అయితే స్టార్ హీరోయిన్ అయ్యేందుకు అన్నీ విధాలుగా అర్హతలు ఉన్నప్పటికీ కేవలం కొన్ని సినిమాలను మాత్రమే చేసి కెరీర్ ని ముగించుకున్న ఒక హీరోయిన్ కృతి ఖర్బందా.
బోణి సినిమా తో హీరోయిన్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈమె, ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘తీన్ ,మార్’ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత యంగ్ హీరో రామ్ నటించిన ‘ఒంగోలు గిత్త’ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈమె, తర్వాత ఎక్కువ కాలం ఇండస్ట్రీ లో హీరోయిన్ గా రాణించలేకపోయింది. ఆ తర్వాత ఈమెకి కన్నడ లో బాలీవుడ్ లో అవకాశాలు బాగానే వచ్చాయి. కానీ దానిని అదే స్థాయిలో కొనసాగించడం లో మాత్రం ఈ హాట్ బ్యూటీ విఫలం అయ్యింది. ఈమె తెలుగు లో చివరిసారిగా కనిపించిన చిత్రం ‘బ్రూస్ లీ’.
ఇందులో ఈమె మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి చెల్లి గా నటించింది. ఆ తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. బాలీవుడ్ లో కూడా గత రెండేళ్ల నుండి ఎలాంటి అవకాశం లేక ఖాళీగానే ఉంది. ఇకపోతే రీసెంట్ గానే ఈ హాట్ బ్యూటీ ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూ లో తనకి ఎదురైనా చేదు జ్ఞాపకాలను కొన్ని చెప్పుకొని బాధపడింది. ఒక కన్నడ సినిమాలో నటిస్తున్నప్పుడు తానూ స్టే చేస్తున్న హోటల్ గదిలో సీక్రెట్ కెమెరాలను గమనించింది అట. ఏ హోటల్ లో స్టే చేసినా, ఆ గదిని తనిఖీ చేసే అలవాటు ఉండడం తో ఆమె ఈ కెమెరాలను పసిగట్టింది అట.
ఈ కెమెరాలను చూసిన వెంటనే తనకి భయం వేసింది అని. వెంటనే పోలీసులకి ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది నటి, విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే హోటల్ వద్దకు చేరుకొని పరిశిలించారు. కెమెరా నిజంగానే ఉందని తెలిసి పోలీసులు కూడా నమ్మలేకపోయారు. వెంటనే దరియాప్తు మొదలు పెట్టిన పోలీసులు హోటల్ సిబ్బంది మొత్తాన్ని లైన్ లో నిలబెట్టారు.
మేనేజర్ సహాయంతో అసలు ఆ రూమ్ వెళ్లారు అని సీసీటీవీ కెమెరాలు చూడటం ప్రారంభించారు. కెమెరా లో చాల మందే రూఓం లోకి వెళ్ళటం చూసారు పోలీసులు. తక్షణమే హోటల్ యాజమాన్యం పై పోలీస్ కేసు నమోదు చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాను అని చెప్పుకొచ్చింది కృతి ఖర్బంద(Kriti Kharbanda).