Kriti Sanon: గత కొంతకాలం నుండి సోషల్ మీడియా లో ప్రభాస్ – కృతి సనన్ ఎంత పెద్ద ట్రెండింగ్ టాపిక్ గా నిల్చారో మన అందరికీ తెలిసిందే. ‘ఆదిపురుష్’ సినిమా సమయం లో కలుసుకున్న వీళ్లిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడిందని, త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఇలా ఎన్నో వార్తలు వచ్చాయి(Kriti Sanon Birthday). అయితే ఇవేమి నిజం కావని అటు ప్రభాస్, కృతి సనన్ చెప్పినా కూడా వాళ్ళ మధ్య నడుస్తున్న కెమిస్ట్రీ చూస్తుంటే అసలు వాళ్ళు లవర్స్ కాదు అంటే ఏమాత్రం నమ్మేలా లేదు అని అభిమానులు అనుకుంటున్నారు.
ఈ జంట చూసేందుకు ఎంతో ముచ్చటగా ఉంది, కలిస్తే బాగుండును అని అనుకునేవాళ్లు ఎంతో మంది ఉన్నారు. అభిమానులతో సహా, ప్రేక్షకులు కూడా వీళ్ళు కలవాలని కోరుకుంటున్నారు. వాళ్ళ కోరిక నెరవేరబోతుందా..? నిజంగానే వీళ్లిద్దరు కలబోతున్నారా..? ఏమో అయ్యుండొచ్చు అని రీసెంట్ గా కృతి సనన్ వేసిన పోస్ట్ ని చూసి అర్థం చేసుకోవచ్చు. ఆమె ఏమి పోస్ట్ చేసిందంటే ‘నా పుట్టిన రోజు నాడు మీ అందరికి ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. నా జీవితం లో అతి ముఖ్యమైన వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను’ అంటూ పోస్ట్ వేసింది. ఎవరు ఆ ముఖ్యమైన వ్యక్తి..?
జీవిత భాగస్వామిని పరిచయం చెయ్యబోతుందా? ప్రభాస్ తో తనకి ఉన్న రిలేషన్ గురించి నిజం చెప్పబోతుందా..? లేదా ఏదైనా సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా ఇలా మాట్లాడిందా..? వంటి సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి(Kriti Sanon Birthday). ఒకవేళ పెళ్ళికి సంబంధించిన వార్త అయితే మాత్రం అభిమానుల ఆనందానికి హద్దులే ఉండవు. కృతి సనన్ ఏమి చెప్పబోతుందో అని ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు, ఇతర హీరోల అభిమానులు కూడా చెప్తున్నారు. ఇక రీసెంట్ గానే వీళ్లిద్దరి కలిసి ‘ఆదిపురుష్’ అనే చిత్రం చేసిన సంగతి తెలిసిందే. రీసెంట్ గానే విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది.
పాపం ఈమధ్య కృతి సనన్ ఉన్న ప్రతీ సినిమా పరిస్థితి ఇలాగే తయారైంది. కంటెంట్ పర్వాలేదు అనే రేంజ్ టాక్ వచ్చినప్పటికీ కూడా కలెక్షన్స్ రావడం లేదు. వృత్తి పరంగా ఇంత దరిద్రంగా ఫేస్ ని ఎదురుకుంటున్న కృతి సనన్, ఒకవేళ ప్రభాస్ తో రిలేషన్ లో ఉన్న విషయం నిజం అయితే వాళ్ళ దాంపత్య జీవితం మంచిగా కొనసాగుతుందో లేదో చూడాలి. బాలకృష్ణ హోస్ట్ చేసిన అన్ స్టాపబుల్ కి ప్రభాస్ వచ్చినపుడు, కృతి సనాన్ పేరు తీసినప్పుడు అల్లా మొఖం వెలిగిపోయింది. కృతి సనాన్ ని మాడం మాడం అను పిలుస్తూ, వీళ్లిద్దరి మధ్య ఏదో ఉందని కంఫర్మ్ చేసేసాడు.