Mahesh Babu : మాములుగా క్యారక్టర్ ఆర్టిస్ట్ లు అంటే ఎలాంటి పాత్రలు అయినా నటిస్తారు మరియు వీరికి ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చిన సరే సినిమాలు చేస్తారని ఓ భావన అందరికి ఉంటుంది. కానీ ఇది తప్పు అని లేట్ శ్రీహరి (Srihari Rejected Mahesh Babu) గారు తెలియజేసారు. ఆయన దెగరికి ఏ స్టోరీ వచ్చిన కూడా వినేవారట. ఒకవేళ ఆ పాత్ర నచ్చకపోతే మొఖం మీదే చెప్పేసేవారట. శ్రీహరి గారు ఒక్కపుడు సైడ్ క్యరెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లోకి వచ్చి మెల్లమెల్లగా కామెడీ పాత్రలు చేసుకుంటూ హీరో స్థాయికి ఎదిగారు.
అప్పట్లో స్టార్ హీరోల సరసన ఈయన ముఖ్య పాత్రలు చేసారు మరియు వాటికి శ్రీహరి గారికి మంచి పేరు వచ్చింది. శ్రీహరి కొన్ని సినిమాలలో హీరోగా కూడా నటించారు. ఈయనే చేసిన సినిమాలలో భద్రాచలం సినిమా మాత్రం ఎప్పటికి గుర్తుండిపోయే సినిమా అని చెప్పుకోవచ్చు. ఆయన మొదటి ఇన్నింగ్స్ లో ఓ 50 కి పైగా సినిమాలు చేసారు. ఆ తరువాత ఆయన కొంత కాలం బ్రేక్ తీసుకొని మల్లి కొద్దీ రోజులకు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. ఈసారి ఆయన విలన్ రోల్స్ చేసుకుంటూ పోయారు మరియు
స్టార్ విలన్ గా ఎదిగారు. శ్రీహరి సినిమాలతో పాటు సోషల్ సర్వీస్ కూడ చేసేవారు. ఆయన ఇంటి వద్దకు సహాయం కావాలని ఎంతమంది పొతే అంత మందికి ఆయన సహాయం అందించేవారట. శ్రీహరి సినిమా ఇండస్ట్రీకి చెందిన డాన్సర్ డిస్కో శాంతిన్నీ ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. శ్రీహరి వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్న సమయంలో ఆరోగ్య సమస్యలతో అనుకోకుండా మరణించారు. ఇది ఆయన అభిమానులకు మరియు చిత్ర యూనిట్ కు షాకింగ్ అనే చెప్పాలి.
ఇదిలా ఉంటె శ్రీహరి మరియు దర్శకుడు శ్రీనువైట్ల కాంబినేషన్ లో డీ సినిమా బారి విజయం అందుకుంది మరియు శ్రీహరి పాత్రకు మంచి పేరు వచ్చింది. ఈ సినిమాలో ఆయన సీరియస్ కామెడీ అందరిని కడుపుబ్బా నవించింది. అయితే ఈ సినిమా తరువాత శ్రీను వైట్ల శ్రీహరి గారిని దూకుడు సినిమాలో మహేష్ బాబు నాన్న పాత్ర కోసం అడిగారట.
దానికి శ్రీహరి మహేష్ బాబు నాన్న పాత్రకు నేను సూట్ అవ్వను అని దర్శకుడికి చెప్పేశాడట. ఆ తరువాత శ్రీను వైట్ల మహేష్ బాబు నాన్న పాత్రకు ప్రకాష్ రాజునూ తీసుకున్నారట. ఈ పాత్ర ప్రకాష్ (Srihari Rejected Mahesh Babu) కు మంచి పేరు తెచ్చి పెట్టింది.