Mahesh Babu Health Issue సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, ఆ తర్వాత బాలనటుడిగా ఉన్న సమయం లోనే ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించి అశేష ప్రేక్షాభిమానం పోయింది సూపర్ స్టార్ గా ఎదిగిన నటుడు మహేష్ బాబు. నేడు యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఆయనకీ ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాము. మామూలు యావరేజి సినిమాలను కూడా మహేష్ బాబు తన స్టామినా తో సూపర్ హిట్ రేంజ్ కి తీసుకెళ్ళిపోతున్నాడు. ఇంతటి స్టార్ స్టేటస్ ప్రస్తుతం మన టాలీవుడ్ లో ఏ స్టార్ హీరో కి కూడా లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.
కేవలం సూపర్ స్టార్ గా మాత్రమే కాదు, మనిషిగా కూడా మహేష్ బాబు ఎంతో మందికి ఆదర్శం. ఒక మంచి ఫ్యామిలీ మ్యాన్ గా మాత్రమే కాకుండా, ఆపదలో ఉన్నవారికి సహాయం చేసే గొప్ప గుణం ఆయన సొంతం. వెయ్యికి పైగా చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్స్ ఉచితంగా చేయించిన ఘనత మహేష్ బాబుది. అలాంటి వ్యక్తికీ ఒక ఆరోగ్య సమస్య నరకం చూపించింది అంటే ఎవరైనా నమ్ముతారా..? కానీ నమ్మాలి, ఎందుకంటే ఈ ఆరోగ్య సమస్య గురించి స్వయంగా మహేష్ బాబు ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు కాబట్టి. ఆయనకీ మైగ్రేన్ సమస్య ఉందట.
ఎన్నో సంవత్సరాల వరకు ఈ వ్యాధి తనని వేధించి నరకం చూపించింది అంటూ మహేష్ చెప్పుకొచ్చాడు(Mahesh Babu Health Issue). ఈ వ్యాధి కి ఎలాంటి చికిత్స కూడా లేదట. ఎంతో మంది స్పెషలిస్ట్ డాక్టర్స్ ని కలిసినా, ఎన్నో మందులు వాడినా ఈ సమస్య మహేష్ బాబు ని వెంటాడుతూనే ఉండేదట. అయితే నమ్రత శిరోద్కర్ కి తెలిసిన డాక్టర్ సత్య సింధూజని కలిసి చక్ర నాడి వైద్యం కచ్చితంగా పని చేస్తుందని చెప్పడంతో మహేష్ బాబు వెంటనే ట్రీట్మెంట్ చేయించుకున్నాడట. ఆ ట్రీట్మెంట్ తో మహేష్ బాబు కి మైగ్రేన్ సమస్య మాయ అయ్యింది. ఎవరైనా ఈ మైగ్రేన్ సమస్య తో బాధపడుతుంటే ఈ ట్రీట్మెంట్ తీసుకోండి అంటూ మహేష్ బాబు సలహా ఇస్తున్నాడు.
ఇది ఇలా ఉండగా మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ‘గుంటూరు కారం’ అనే సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తర్వాత రాజమౌళి తో కలిసి ఒక సినిమా చెయ్యబోతున్నాడు. రాజమౌళితో చేసే సినిమా కోసం 3 నెలలు ట్రైనింగ్ కూడా తీసుకోబోతున్నాడు మహేష్. గుంటూరు కారం వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే మహేష్ జక్కన్నతో కలిసి తన కెరీర్ లోనే అతి పెద్ద సినిమాకి రెడీ అవుతాడు. ఫాన్స్ మాత్రం త్రివిక్రమ్ గుంటూరు కారణం సినిమా కన్నా రాజమౌళితో చేసే సినిమా కోసం ఎదురుచూస్తున్నారు అనే చెప్పుకోవాలి మరి.