Home Cinema Mahesh Babu: మీడియా అడిగిన ప్రశ్నలకి గూప గుయ్యు మనే సమాదానం ఇచ్చిన మహేష్ బాబు..

Mahesh Babu: మీడియా అడిగిన ప్రశ్నలకి గూప గుయ్యు మనే సమాదానం ఇచ్చిన మహేష్ బాబు..

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చాడు. ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తున్న బిగ్ సి షో రూమ్ ప్రారంభమై 12 ఏళ్ళు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా మహేష్ బాబు బిగ్ సి యాజమాన్యం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పాల్గొన్నాడు. ఈ ప్రెస్ మీట్ లో ఆయన మీడియా రిపోర్టర్స్ అడిగే ఎన్నో ప్రశ్నలకు చాలా ఫన్నీ సమాదానాలు చెప్పాడు(Mahesh Babu Media Interaction). మీ ఫోన్ రింగ్ టోన్ ఏమిటో తెలుసుకోవచ్చా అని ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి మహేష్ బాబు సమాధానం చెప్తూ ‘నా ఫోన్ ఎప్పుడూ సైలెంట్ లోనే ఉంటుంది అండీ’ అంటూ సమాధానం చెప్పాడు.

Mahesh-babu-media-interaction

ఈ సమాధానం కి ఆడిటోరియం మొత్తం నవ్వులతో నిండిపోయింది. ఇక ఆ తర్వాత ఆయన ఇలాగె ఎన్నో ప్రశ్నలకు ఫన్నీ సమాదానాలు ఇచ్చాడు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ ఇన్ బిల్డ్ గా ఉంటుంది, ఆయనని తింగరి ప్రశ్నలు అడిగితె ముఖం వచ్చిపోయే రేంజ్ లో పంచ్ ఇచ్చేస్తాడు. అలా ఒక మీడియా రిపోర్టర్ కి మహేష్ బాబు నుండి దిమ్మతిరిగిపోయే రేంజ్ కౌంటర్ పడింది. మీరు ట్రిప్స్ వెయ్యడం పై సోషల్ మీడియా లో చాలా ట్రోలింగ్స్ వస్తున్నాయి, ఇవి మీదాకా వచ్చిందా అని అడగగా దానికి మహేష్ బాబు సమాధానం చెప్తూ ‘నేను ట్రిప్స్ వెయ్యడం మీకు బాగా జలసీ గా ఉన్నట్టుండి కదా.

నేను ట్రిప్స్ వేస్తే మీకొచ్చిన నష్టం ఏమిటండి’ అంటూ చాలా ఫన్నీ గా సమాధానం ఇచ్చాడు(Mahesh Babu Media Interaction). అలాగే గుంటూరు కారం మూవీ సంక్రాంతి రేస్ నుండి తప్పుకుంటుంది అంటూ సోషల్ మీడియా లో వస్తున్న రూమర్స్ ని మహేష్ బాబు దృష్టికి ఒక రిపోర్టర్ తీసుకెళ్లగా, ఆయన దానికి సమాధానం చెప్తూ ‘జనవరి 12 వ తేదీన సినిమా కచ్చితంగా విడుదల అవుతుంది’ అని మరోసారి క్లారిటీ ఇచ్చాడు. ఇకపోతే గత రెండు మూడు రోజుల నుండి కొత్త షెడ్యూల్ ప్రారంభం అయ్యింది. ఈ షెడ్యూల్ లో మహేష్ బాబు మరియు ప్రధాన తారాగణం పై ఇంటర్వెల్ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఈ సన్నివేశం మహేష్ బాబు కెరీర్ లోనే ది బెస్ట్ గా ఉండబోతుందని సమాచారం, ఇందులో శ్రీలీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తుండగా, జగపతి బాబు విలన్ గా నటిస్తున్నాడు. ఇటీవలే యాంకర్ సుమ తో జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మహేష్ తనకు ఉన్న ఒక రోగం గురించి కూడా చెప్పుకొచ్చాడు. తాను ఎన్నో ఎలనుండి మైగ్రేన్ తో బాధ పడుతున్నాను అని, ఎన్ని డాక్టర్లకు చూపించిన తగ్గలేదు అని చెప్పాడు మహేష్.

కానీ మహేష్ కి ఒక నాటు వైద్యం వల్ల మైగ్రేన్ తగ్గింది అని, ఇప్పుడు ఎటువంటి బాధ లేకుండా సినిమాలు చేసుకోవచ్చు అని చెప్పాడు మహేష్. తనకు నయం చేసిన డాక్టర్ కి ఎపుడు రుణపడి ఉంటానని చెప్పుకొచ్చాడు మహేష్.

Exit mobile version