Home Cinema Mahesh Babu : వివాదంలో చిక్కుకున్న మహేష్ బాబు.. కారణం ఏంటంటే..

Mahesh Babu : వివాదంలో చిక్కుకున్న మహేష్ బాబు.. కారణం ఏంటంటే..

Mahesh Babu : అవును మీరు వినేది నిజమే. ఈ వార్త సోషల్ నెట్‌వర్క్‌లలో జోరుగా సర్క్యూలేట్ అవుతుంది. ఈ వార్తా చుసిన మహేష్ బాబు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివాదాస్పద విషయాలను డీల్ చేయడం మహేష్ బాబుకు ఇష్టం లేదన్న సంగతి మన అందరికి తెలిసిందే. ఆయన నోటి నుంచి ఒక్క వివాదాస్పద పదం కూడా రాదు. అయితే ప్రస్తుతం మహేష్ బాబు పెద్ద చిక్కుల్లో పడ్డాడని ఇంటర్నెట్లో వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబు అటు సినిమాలు చేసుకుంటా మరో వైపు యాడ్స్ కూడా చేస్తున్నారు.

ఈయన ఎప్పటి నుండో ఇలా చేసుకుంటూ వస్తుండు. ఆయన యాడ్స్ నుండే కొని కోట్ల రూపాయిలు సంపాదిస్తుంటాడు. అయితే తాజాగా మహేష్ బాబు ఓ యాడ్ చేసి వివాదాలలో ఇరుక్కున్నాడు. మహేష్ ఇటీవల పాన్ బహార్ గుట్కా యాడ్ చేసారు. ఇది చూసిన చాల మంది షాక్ అయ్యారు. ఇది పేరుకు మాత్రమే మౌత్ ఫ్రెషనర్ కానీ ఇందులో పొగాకు కూడా ఉంటుంది, ఇవి తింటే నోటి క్యాన్సర్‌ వస్తుంది అంటూ నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం చాలా మందికి తెలుసు.

mahesh-babu-in-controversy-for-doing-pan-bahar-ad

కానీ మహేష్ బాబు ఇలాంటి ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయడం ఏంటి అని అనుకుంటున్నారు. ముఖ్యంగా ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. డబ్బు కోసం మహేష్ బాబు ఇలా చేస్తాడా అంటూ ఆ వీడియోలో ఆయనపై విమర్శలు గుప్పించారు. అయితే ఈ వీడియో వైరల్ కావడంతో మహేష్ బాబు అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. అయితే ఇది ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది అనేది మనకు తెలీదు కానీ ఆ వీడియో ఇంటర్నెట్లో కనుమరుగైంది. అయితే దీన్ని మహేష్ బాబు టీమ్ రిపోర్ట్ చేసారు అందుకే ఆ వీడియో డిలీట్ అయిపోయింది అని అంటున్నారు.

Exit mobile version