Friday, September 13, 2024
HomeCinemaMahesh Babu : తల్లి చివరి కోరిక తీర్చనున్న మహేష్ బాబు.. ఏంటో తెలుసుకోవాలని ఉందా..

Mahesh Babu : తల్లి చివరి కోరిక తీర్చనున్న మహేష్ బాబు.. ఏంటో తెలుసుకోవాలని ఉందా..

Mahesh Babu : మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చాడు. అలా చిన్న వయసులోనే మహేష్ బాబు నటన రంగంలో మంచి పేరు సంపాదించుకున్నారు. మహేష్ ( Mahesh Babu Daughter Sitara ) నటనకు సినిమా ప్రేక్షకులు మంత్రం ముగ్దులయ్యారు మరియు ప్రిన్స్ అనే టాగ్ ను కూడా ఆయనకు ఇచ్చారు. ఇలా మహేష్ బాబు చిన్న తనంలోనే మెయిన్ రొలెస్ నటించి సక్సెస్ అందుకోవడం వలన, కృష్ణ గారు మహేష్ ను హీరో గా పరిచయం చేసాడు.

sitara

మహేష్ ఎప్పటిలాగే తన నటన తో మంచి పేరు సంపాదించుకొని స్టార్ హీరోల జాబితాలోకి చేరాడు. మహేష్ బాబు తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు చేసారు. ఇదిలా ఉంటె, ఈ మధ్య కాలం లో మహేష్ బాబు ఇంట్లో వరుస మరణాలు చోటు చేసుకున్నాయి. మొదట మహేష్ అన్నగారు అయినా రమేష్ బాబు గుండెపోటుతో మరణించారు. ఈ బాధలో నుండి కోలుకునే లోపల మహేష్ బాబు అమ్మగారు కాలం చేసారు. ఇది మహేష్ బాబు అసలు తీసుకోలేకపోయారు.

mahesh-babu-planned-grand-function-for-his-daughter-sitara-saree-function

ఈ బాధలలో మహేష్ చాలా కృంగిపోతున్న సమయం లో కృష్ణ గారు మరణించారు. ఇన్ని మరణాలు ఘట్టమనేని కుటుంబం లో ఒక్క సంవత్సరం లోపే చోటు చేసుకున్నాయి. వీటిలో నుండి మహేష్ బాబు బయటపడి మామూలు మనిషి అవ్వడానికి చాలా సమయం పట్టింది. మహేష్ బాబు ప్రస్తుతం మల్లి సినిమా షూటింగ్లు మొదలుపెట్టారు. అయితే మహేష్ బాబు తన అమ్మగారి చివరి కోరిక ను తీరుస్తున్నాడు అని ఓ వార్తా నెట్ ఇంట్లో హల్చల్ చేస్తుంది. అదేంటో మనం ఇపుడు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

mahesh-babu-planned-grand-function-for-his-daughter-sitara-saree

అయితే మహేష్ అమ్మగారు ఇందిరా దేవి గారు తన మనవరాలు అయినా సితార ఓణీల ఫంక్షన్ తాను ఉన్నపుడే చేయమని మహేష్ ను కోరారట. కానీ మహేష్ బాబు తనకు ఉన్న పనుల వాళ్ళ చేయలేకపోయారట. అంతలోనే ఇందిరా దేవి గారు కాలం చేసారు. ఇప్పుడు మహేష్ తన అమ్మగారి కోరిక అయినా సితార ఓణీల ఫంక్షన్ ను గ్రాండ్ గా చేయబోతున్నారు అని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ ఫంక్షన్ కు ఘట్టమనేని కుటుంబం మరియు ( Mahesh Babu Daughter Sitara ) ఇండస్ట్రీ నుండి మహేష్ ఫ్రెండ్స్ హాజరవ్వబోతున్నారు. ఇదిలా ఉంటె మహేష్ ప్రస్తుతం గుంటూరు కారం సినిమా షూటింగ్లో ఉన్నాడు. ఈ సినిమా అయిపోయాక రాజమౌళి తో సినిమాను మొదలు పెడతారు మహేష్.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts