Home Cinema Jr NTR : ఆంధ్రలో కూటమి గెలవడంతో ఎన్టీఆర్ సంచలన పోస్ట్.. ఇంటర్నెట్ లో హల్చల్..

Jr NTR : ఆంధ్రలో కూటమి గెలవడంతో ఎన్టీఆర్ సంచలన పోస్ట్.. ఇంటర్నెట్ లో హల్చల్..

jr-ntr-wishes-to-balakrishna-and-chandrababu-for-tdp-kutami-winning-andhra-elections-via-twitter

Jr NTR : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే జూన్ 4వ తేదీతో ఆసక్తి కి ఫుల్ స్టాప్ పడింది. ఆంధ్ర ప్రజలు కూటమికి ఓట్లు వేసి టీడీపీ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చారు. ఈ కూటమి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ అని చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. అయితే టీడీపీకి ఇంత పెద్ద విజయం రావడంతో టీడీపీ కూటమి నేతలపై సోషల్ మీడియాలో సినీ పరిశ్రమ నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.

దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఎన్టీఆర్ పై పడింది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులకు టీడీపీ నుండి విజయం సాధించినందుకు అభినందలు అందిస్తారని అందరూ అనుకున్నారు. అయితే ఊహించిన విధంగానే ఎన్టీఆర్ తన కుటుంబ సబ్యులకు అభినందనలు తెలపడానికి తన సోషల్ మీడియా ఖాతాలో ప్రత్యేక పోస్ట్‌ను పంచుకున్నాడు. ఎన్టీఆర్ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ ను షేర్ చేసాడు. మామయ్య చంద్రబాబు గారికి ఆంధ్రాలో చారిత్రాత్మక విజయం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది.

మీరు ఆంధ్రప్రదేశ్‌ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని ఆశిస్తున్నాను. బాలయ్య బాబాయి, పురందరేశ్వరి అత్తయ్య మరియు భరత్‌కు కూడా నా శుభాకాంక్షలు. లోకేష్ మంగళగిరిలో ఎవరు ఊహించని మెజారిటీని సాధించడం నాకు చాలా గర్వంగా ఉంది అంటూ ఎన్టీఆర్ తెలిపారు. పిఠాపురంలో ఘనవిజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూనాను. ప్రస్తుతం ఈ పోస్ట్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారడంతో పలువురు నందమూరి అభిమానులతో పాటు టీడీపీ అభిమానుల్లో కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version