Friday, September 20, 2024
HomeCinemaNamrata : 20 ఏళ్ళ తరువాత అలాంటి పని చేయబోతున్న నమ్రత.. ఏంటంటే..

Namrata : 20 ఏళ్ళ తరువాత అలాంటి పని చేయబోతున్న నమ్రత.. ఏంటంటే..

Namrata : సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య హీరోయిన్ నమ్రతా గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మోడల్ గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత సినిమాల్లో నటించిన నమ్రత తక్కువ కాలంలోనే బాలీవుడ్ స్టార్ గా మారిపోయింది. 2000లో వంశీ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా సమయంలో హీరో మహేష్ బాబుతో ప్రేమలో పడింది. దాదాపు ఐదేళ్లపాటు రహస్య బంధం కొనసాగించిన ఈ జంట 2005లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. గౌతమ,సితార తమకు పుట్టారు.

నమ్రత కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు మహేష్‌తో కలిసి ఏడడుగులు వేసింది. పెళ్లి తర్వాత సినిమాల్లో నటించడం మానేసింది. పలు ఆఫర్లు వచ్చినా తిరస్కరించారు. స్టార్ హీరోయిన్ హోదాను వదిలి ఆదర్శ గృహిణిగా ఉండి, నమ్రత గత కొన్నేళ్లుగా మహేష్ బాబు సినిమాలను ఎంపిక చేసుకోవడంలోనూ మరియు ఆయన వ్యవహారాలను నడపడంలోనూ కీలక పాత్ర పోషించింది. ఇదిలా ఉంటే, తాజాగా నమ్రతకు సంబంధించిన ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత నమ్రత మళ్లీ కెమెరా ముందుకు వచ్చింది.

Namrata Re-entry To Acting

తాజాగా నమ్రత మళ్లీ సినిమా రంగంలోకి రావడంపై ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకుంది. దీనికి మహేష్ బాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో తాజాగా నమ్రత ఓ సినిమాకు సైన్ చేసిందని టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఓ ప్రముఖ ఫ్యామిలీకి చెందిన ఓ యంగ్ హీరో సినిమాతో నమ్రత తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తుందని అంటున్నారు. అంతేకాదు ఈ సినిమాలో నమ్రత నెగెటివ్ ఉన్న కీలక పాత్రలో నటిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts