Home Cinema అర్ధ రాత్రి రామ్ చరణ్ కి ఫోన్ చేసి డబ్బు సహాయం అడిగిన మంచు మనోజ్.....

అర్ధ రాత్రి రామ్ చరణ్ కి ఫోన్ చేసి డబ్బు సహాయం అడిగిన మంచు మనోజ్.. చరణ్ ఎంత ఇచ్చాడంటే..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మంచితనం గురించి ప్రేత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తండ్రి బాబాయ్ లానే చరణ్ కి కూడా సేవా గుణం చాలా ఎక్కువ, ఇది మనం చాల సందర్భాల్లో చూసాం. ప్రస్తుతం రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ గేమ్ చెంజర్ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని డైరెక్టర్ బుచ్చి బాబు సనా తో తన తరువాయి సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా చెర్రీ సరసన నటించనుంది.

మొన్న రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా తిరుమల వెళ్లి దర్శనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఉపాసన, క్లిన్ కార, చరణ్ ఏడుకొండల వారిని దర్శించుకున్నారు. ఇక ఆ సమయంలోనే మొట్ట మొదటి సారి క్లిన్ కార మొఖం కెమెరాకు చిక్కింది. ఆ ఫోటోలు సోషల్ మీడియా మొత్తం వైరల్ అయ్యాయి. ప్రస్తుతం మంచు మనోజ్ రామ్ చరణ్ దెగ్గర డబ్బుల సహాయం అడిగాడు అని ఒక వార్త వస్తుంది.

ram-charan-manchu-manoj

విషయంలోకి వెళితే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఒక ఈవెంట్ చేసారు దానికి మనోజ్ ముఖ్య అతిధిగా వెళ్ళాడు. అక్కడ చరణ్ గురించి మాట్లాడుతూ, 2018లో ఒక రోజు తాను అమెరికా లో ఉన్నపుడు ఒక ఫోన్ వచ్చింది అని ఇమ్మిగ్రేషన్ లో ఒక అమ్మాయి దుబాయ్ లో ఇరుకొని సమస్య ఎదురుకుంటుంది అని 5 లక్షలు అవసరం ఉంది అని తెలిసింది, కానీ అప్పుడు నా దెగ్గర అంత డబ్బులేదు. వెంటనే రామ్ చరణ్ కి అర్ధరాత్రి కాల్ చేసి ఇలా ఉంది అని చెప్పాను నిమిషాల్లో డబ్బులు పంపించి సహాయం చేసాడు అంటూ చెప్పుకొచ్చాడు మంచు మనోజ్.

Exit mobile version