Saturday, November 23, 2024
HomeCinemaChiranjeevi: చిరంజీవి ధరించిన ఈ వాచ్ దర ఎంతో తెలిస్తే మీ మతి పోతుంది..

Chiranjeevi: చిరంజీవి ధరించిన ఈ వాచ్ దర ఎంతో తెలిస్తే మీ మతి పోతుంది..

Chiranjeevi Watch Price: ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం సంక్రాంతి మకానుకగా వచ్చి , బాక్స్ ఆఫీస్ వద్ద సునామి లాంటి వసూళ్లను రాబట్టి ఆల్ ఈమె టాప్ 5 చిత్రాలలో ఒకటిగా నిల్చిన సంగగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం సుమారుగా 140 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. అలాగే 50 రోజులు, వంద రోజులు ఆడడమే కాకుండా ఏకంగా 200 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఓటీటీ రాజ్యం ఏలుతున్న ఈ రోజుల్లో ఒక సినిమా 200 రోజులు పూర్తి చేసుకుందంటే సాధారణమైన విషయం కాదు.

chiranjeev-watch-price-and-details

అవనిగడ్డ ప్రాంతం లో ఈ సినిమా లో 200 రోజులు పూర్తి చేసుకుంది. దీనికి సంబంధించిన ఈవెంట్ ని రీసెంట్ గానే ఏర్పాటు చెయ్యడం తో మూవీ యూనిట్ లో చిరంజీవి, రవితేజ తో సహా అందరూ పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి. రాజకీయంగా కూడా ఆ మాటలు పెను దుమారమే రేపింది. దానికి సంబంధించిన రచ్చ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు గాను ఈరోజు విడుదలైన ‘భోళా శంకర్’ చిత్రానికి టికెట్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతిని ఇవ్వలేదు ప్రభుత్వం.

chiranjeevi-ravi-teja

ఇది ఇలా ఉండగా చిరంజీవి కి చేతి వాచ్ లు అన్నా అలాగే కార్లు అన్నా ఎంతో ఇష్టమని మన అందరికీ తెలిసిందే. మొన్న జరిగిన ‘వాల్తేరు వీరయ్య’ 200 రోజుల సక్సెస్ మీట్ లో చిరంజీవి ధరించిన వాచ్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది(Chiranjeevi Watch Price). ఈ వాచ్ పేరు కార్టియర్ టార్ట్యూ బ్రౌన్ లెదర్ వాచ్ అట, ఈ వాచ్ ధర ఎంత ఉంటుందో అని ఆన్లైన్ లో వెతకగా, దాని ధర 35 లక్షల రూపాయిలు అని తెలిసింది. అంతే కాదు, చిరంజీవి దగ్గర రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డేటోనా వాచ్ అనే వాచ్ కూడా ఉంది.

chiranjeevi-waltair-verayya-200-days

రీసెంట్ గా జరిగిన బేబీ మూవీ సక్సెస్ మీట్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన చిరంజీవి, ఈ వాచ్ ధరించి వచ్చాడు. దీని విలువ రెండు కోట్ల రూపాయిల వరకు ఉంటుందట. దీని ధర తెలుసుకున్న ఫాన్స్ ట్విట్టర్లో తన అభిప్రాయాలను పంచుకున్నారు. కొందరు ఏమో మెగాస్టార్ ఆ మజాకా అంటుంటే, మరికొందరు ఏమో 10 కుటుంబాలు బతుకుతాయి ఆ డబ్బుతో అంత కాస్టలీ వాచ్ అవసరమా అని కూడా తమ అభిప్రాయాన్ని తెలియచేసారు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts