Home Cinema నేనే డాక్టర్ దెగ్గరికి తీసుకెల్లా.. ఉదయ్ కిరణ్ మరణం గురించి ఎవరికీ తెలియని నిజం చెప్పిన...

నేనే డాక్టర్ దెగ్గరికి తీసుకెల్లా.. ఉదయ్ కిరణ్ మరణం గురించి ఎవరికీ తెలియని నిజం చెప్పిన మురళి మోహన్..

Murali Mohan-Uday Kiran : ఉదయ్ కిరణ్ అతితక్కువ టైం లోనే టాలీవుడ్ కి లవర్ బాయ్ అనే పేరు సంపాదించుకున్నాడు. తన సహజ నటనతో, అందమైన చిరునవ్వుతో అమ్మాయిల గుండెల్ని కొల్లకొట్టాడు. ఉన్న కొంత కాలంలోనే మంచి పాపులర్ సెలబ్రిటీ జీవితాన్ని చూసాడు. చాల చిన్న వయసులోనే తన జీవితం అలా ముగిసిపోవడం చాలా బాధాకరం. ఇప్పటికి కూడా ఉదయ్ కిరణ్ కి మంచి అభిమానులు ఉన్నారు, అతడి సినిమాలు ఇప్పుడు కూడా చూస్తూ ఉంటారు.

తను టాప్ పొజిషన్లో ఉన్న సమయంలో చిరంజీవి కూతురు శ్రీజ పరిచయం అయింది. అలా వారిద్దరి దెగ్గర అయ్యారు, ఇద్దరి మనసులు కలిసాయి. ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఇరుగూరి ఇంట్లో ఒప్పుకోవటంతో పెళ్లి ఖాయం అనుకున్నారు కానీ ఎం జరిగిందో ఏమో కానీ ఉదయ్ కిరణ్ వేరే అమ్మాయిలు పెళ్లి చేసుకున్నాడు. దీనితో మెగా కుటుంబానికి తల తీసేసినట్టు అయింది. అప్పటి నుంచి ఉదయ్ కిరణ్ కి సినిమా అవకాశాలు రానివ్వకుండా చిరంజీవి అడ్డుపడ్డాడు అని అప్పట్లో పుకారులు కూడా వినిపిచ్చాయి.

uday-kiran

ఇటీవల మురళి మోహన్ గారు ఒక ఇంటర్వ్యూలో పాల్కొనటం జరిగింది. అందులో ఉదయ్ కిరణ్ జీవితం గురించి హోస్ట్ అడగగా ఉదయ్ కిరణ్ కి హైపర్ టెన్షన్ ఉంది అని, ఆ అబ్బాయి బాగా టెన్షన్ తీసుకుంటాడు అని వెల్లడించారు. తనను మంచి హాస్పిటల్ కి తానే స్వయంగా తీసుకువెళ్లారని, అక్కడ డాక్టర్ కూడా ఉదయ్ కిరణ్ ని తమ్ముడిలా భావించి మంచి ట్రీట్మెంట్ ఇచ్చి కొన్ని సలహాలు చెప్పి అవి కచ్చితంగా పాటించాలి అని చెప్పింది. కానీ ఉదయ్ కిరణ్ అవి అసలు వినేవాడు కాదు. ఇక ఆ సమయంలో తనకు ఇండస్ట్రీ నుంచి బాగా ప్రెషర్ రావటం, సినిమా అవకాశాలు రాకపోవటంతో అస్సలు తీసుకోలేకపోయారు అంటూ చెప్పుకొచ్చారు మురళి మోహన్ గారు.

Exit mobile version