Naga Chaitanya : అందాల తార సమంత ఏ మాయ చేసావె సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ చిత్రం విజయం తర్వాత ఆమె కెరీర్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అగ్ర హీరోలతో సినిమాల్లో నటిస్తూ అగ్రకథానాయికగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఈ అమ్మడు అక్కినేని నాగ చైతన్యతో ప్రేమలో పడ్డారు మరియు ఆరేళ్లు సహజీవనం కూడా చేసారు. ఆ తరువాత పెళ్లి చేసుకొని కొద్దీ రోజులకే విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు వారిద్దరూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.
మైయోసైటిస్ వ్యాధి కారణంగా కొంతకాలం ఇండస్ట్రీకి దూరమైన సమంత, మళ్లీ తన రెండో ఇన్నింగ్స్ కు సిద్ధమైంది. ప్రస్తుతం ఈమె చేతిలో ఓ వెబ్ సిరీస్ మరియు దర్శకుడు అట్లీ చిత్రంతో పాటు తన సొంత ప్రొడక్షన్ హౌస్ నుండి ఒక చిత్రంలో కూడా చేస్తుంది. ఈమె పై సోషల్ నెట్‌వర్క్స్‌లో అప్పుడప్పుడు ట్రోల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నాగ చైతన్య, శోభిత రిలేషన్ షిప్ లో ఉన్న సంగతి తెలిసిందే.
అయితే, దీనిని ఇద్దరూ ఖండించారు. దీనిపై సమంత కూడా కామెంట్స్ చేసింది. కానీ విడాకుల తర్వాత, మీరు అతని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని కొందరు ట్రోల్ కూడా చేసారు. అయితే తాజాగా సాయి పల్లవి పుట్టినరోజు సందర్భంగా తాండల్ చిత్ర యూనిట్ ఓ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో, సాయి పల్లవి చైతన్యకు ప్రేమగా తినిపిస్తూ కనిపించింది. ఇక్కడ కూడా ట్రోలర్లు ఏకమయ్యారు. సమంతకు నాగ చైతన్య మళ్లీ షాక్ ఇచ్చాడంటూ సోషల్ మీడియాలో ఈ టాపిక్ ను ట్రెండ్ చేస్తున్నారు.