Sunday, October 6, 2024
HomeCinemaNaga Chaitanya : చైతూకి మొదలైన కొత్త తలనొప్పి.. ఇదెక్కడి కర్మరా బాబు..

Naga Chaitanya : చైతూకి మొదలైన కొత్త తలనొప్పి.. ఇదెక్కడి కర్మరా బాబు..

నాగ చైతన్య టాలీవుడ్ ప్రేక్షకులకు చాలా సుపరిచితం. అక్కినేని నాగార్జున వారసత్వంతో ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన నాగ చైతన్య మొదట్లో పెద్దగా మంచి సినిమాలు చేయకపోయినా మెల్లిగా తన నటన నైపుణ్యాలు పెంచుకుంటూ, మంచి కథలను ఎంచుకుంటూ ఇండీస్ట్రీ లో బానే నిలదొక్కుకున్నాడు. నాగ చైతన్య ప్రస్తుతం టాండేల్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాని చందు మొండేటి దర్శిస్తుండగా, 2 పిక్చర్స్ బన్నీ మరియు గీత ఆర్ట్స్ నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది, సెకండ్ హీరోయిన్ గా కీర్తి సురేష్ ని అనుకుంటున్నారు మేకర్స్ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. తండేల్ సినిమాకు ప్రస్తుతం ఒక పెద్ద ముప్పు వచ్చి పడింది, నాగ చైతన్యకు ఎపుడు ఏదో ఒక తలనొప్పి వస్తూనే ఉంటుంది. సాఫీగా సినిమా చేసుకుందాం అని నాగ చైతన్య ఎప్పుడు అనుకున్న ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. డైరెక్టర్ క్రిష్ ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాడు.

naga-chaitanya-thandel

ఆ వెబ్ సిరీస్ కూడా మత్స్యకారుడు గురించే, ఇద్దరు మత్స్యకారులు వేట కోసమని సముద్రంలోకి వెళ్లి అలల తాకిడి వల్ల భారత దేశపు బోర్డర్ దాటేస్తారు, అప్పుడు ఎం జరుగుతుంది అనేది వెబ్ సిరీస్. నాగ చైతన్య టాండేల్ సినిమా కూడా ఇంచుమించు ఇలానే ఉండబోతుంది. తండేల్ దసరా కి రిలీజ్ చేయబోతున్నారు కానీ అప్పట్లోపు క్రిష్ ఆ వెబ్ సిరీస్ రిలీజ్ చేస్తే నాగ చైతన్య సినిమాకు పెద్ద దెబ్బ పడే అవకాశం ఉంది. ఇది ఇప్పుడు నాగ చైతన్యకు పెద్ద తలనొప్పిగా మారింది.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts