Home Cinema Naga Chaitanya : “బుజ్జి” సూపర్ కార్ రైడ్ చేసిన నాగ చైతన్య.. థ్రిల్లింగ్ అంటూ...

Naga Chaitanya : “బుజ్జి” సూపర్ కార్ రైడ్ చేసిన నాగ చైతన్య.. థ్రిల్లింగ్ అంటూ పోస్ట్..

Naga Chaitanya : పాన్-ఇండియన్ సినిమా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న భారీ చిత్రం కలి 2898 AD. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్-ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ భారతీయ సినిమా గర్వించదగ్గ మరో చిత్రం అవుతుంది అని అందరు నమ్ముతున్నారు. ఇటీవల కల్కి సినిమా యూనిట్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు బజ్జీ సూపర్‌ కార్. బుజ్జి కార్ అందరి మతులు పోగొట్టింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

కల్కి సినిమా కోసం మహీంద్రా కంపెనీ మరియు అంతర్జాతీయ కార్ మేకర్స్ బుజ్జి సూపర్ కార్ ను తయారు చేసారు. ఈ కారును ఇండియాలో ప్రసిద్ధి చెందినా ఆటోకార్ ఛానల్ వాలు డ్రైవ్ చేసారు.ఈ వియోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటె, తాజాగా యువ నటుడు నాగ చైతన్య ఈ కారును నడుపుతున్న యొక్క విజువల్ ఆయాన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసారు. ఇక ఈ వీడియోలో చైతూ తన అనుభవాన్ని చాలా ఆసక్తికరంగా చెప్పాడు.

naga-chaitanya-post-riding-bujji-super-car-from-kalki-2898-ad

అతను షాక్‌లో ఉన్నాడని మరియు యూనిట్ డిజైన్ నిబంధనలన్నింటినీ ఉల్లంఘిస్తు బుజ్జి ను తయారు చేసారు అంటూ చెప్పుకొచ్చారు. ఈ కార్ రైడ్ ఫోటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. అతని రైడ్ చాలా ఉత్సాహంగా ఉందని చైతన్య చెప్పారు. కల్కి సినిమా జూన్ 27 న మన ముందుకు రాబోతుంది. ఈ సినిమా కోసం యావత్ ప్రపంచం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు నెటిజనులు. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నాము.

Exit mobile version