Vijay Devarakonda : సినిమా అనేది రంగుల ప్రపంచం. అక్కడ ఏం జరిగినా ఇట్టే వైరల్ అవుతోంది. సోషల్ మీడియా పుణ్యమాని సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న వార్త అయినా వెంటనే వైరల్ అయిపోతుంది. వాటిలో కొన్ని వార్తలు వింటానికి విచిత్రంగా ఉంటాయి. ఇక అలాంటి వార్త ఒకటి తెగ చక్కర్లు కొడుతుంది. విజయ్ దేవరకొండ(Naga Chaitanya Vijay Devarakonda), సమంతలపై నాగచైతన్య రివేంజ్ తీర్చుకోతున్నాడని సమాచారం. నిజానికి విజయ్ దేవరకొండ కి నాగచైతన్యకి మధ్య ఎలాంటి తగాదాలు లేవు.
వారిద్దరి మధ్య సమంత వ్యవహారం జోరుగా నడుస్తోందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. విజయ్ సమంతా కలిసి నటించిన తాజా చిత్రం ఖుషి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, సమంతల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ సూపర్ గా పండింది. ఎంతలా అంటే ఒక షార్ట్ లో లిప్ లాక్ సీన్ లో ఇద్దరూ లీనమైపోయారు. ఆ సీన్ తో పాటు వారిద్దరి బెడ్స్ సీన్స్ కూడా ఉన్నాయి. కాకపోతే అవి మనం చూడలేం. కారణం వాటిని తీసేశారట.
ఇక ఆ సీన్స్ అన్నీ కూడా సమంత మాజీ భర్త నాగ చైతన్య వద్దకు వెళ్లాయి. అవి చూసిన చైతు బాగా హర్ట్ అయ్యాడన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక పోతే సమంత ఎవరు చెప్పినా వినే వ్యక్తిత్వం కాదు. కనీసం విజయ్ దేవరకొండ అయినా తన ఫ్యామిలీ పరువు ప్రతిష్టలను దృష్టిలో ఉంచుకుని రొమాంటిక్ సీన్స్ తీయకుంటే బాగుంటుందని నాగ చైతన్య ఫీలవుతున్నాడని సమాచారం. చైతు సమంత విడిపోయినప్పటికీ వారిపై రూమర్స్ మాత్రం మీడియాలో తగ్గడం లేదు.
ఒకటి పోగానే మరొకటి వరుసగా పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో షికారు చేస్తుంది. దీంతో నాగచైతన్య విజయ్ పై ఎలాగైనా సరే రివేంజ్ తీర్చుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నాగ చైతన్య తదుపరి సినిమాలో హీరోయిన్ రష్మిక ను ఎలాగైనా తీసుకోవాలని ప్లాన్ చేశాడట. వాస్తవానికి రష్మిక తో విజయ దేవరకొండ(Naga Chaitanya Vijay Devarakonda) రిలేషన్ షిప్ మెయింటేన్ చేస్తున్నాడంటూ కొంత కాలంగా వినిపిస్తున్న వార్త.
అందుకే రష్మికతో నాగచైతన్య రొమాన్స్ చేసి విజయ్ దేవరకొండను బాధ పెట్టాలని స్కెచ్ వేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తన తదుపరి సినిమా దర్శకుడితో కూడా రష్మికతో తనకు చాలా ఘాటైన రొమాంటిక్ సీన్స్ ఉండాలని నాగ చైతన్య కండీషన్ పెట్టాడట. అలా రష్మికతో రొమాన్స్ చేసి విజయ్ పై రివేంజ్ కు ప్లాన్ చేశాడట చైతు. నెటిజన్స్ విజయ్ దేవరకొండపై రివేంజ్ ప్లాన్ మామూలుగా లేదు అంటూ కామెంట్లు పెడుతున్నారు.