Naga Chaitanya : నాగ చైతన్య సమంత బ్రేకప్ గురించి సోషల్ మీడియాలో చాలా కారణాలు ఇంటర్నెట్ లో వ్యాపించింది. వీరికి సంబందించిన చిన్న వార్త అయినా సోషల్ నెట్‌వర్క్‌లలో ట్రెండ్ అవుతూనే ఉంటాయి. అయితే ఎట్టకేలకు తాను చేసిన మోసాన్నినాగ చైతన్య అంగీకరించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన సమంత అభిమానులందరూ నాగ చైతన్య వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని సమంతతో విడాకులు తీసుకున్నారని కామెంట్ల వర్షాణి కురిపిస్తున్నారు.
ఇప్పుడు ఈ వీడియోలో నాగ చైతన్య ఏం చెప్పాడో మనం ఇక్కడ తెలుసుకుందాం. ఓ ఇంటర్వ్యూలో నాగ చైతన్య మాట్లాడుతూ నా ప్రేమ జీవితంలో నేను పెద్ద మోసం చేశాను అని అన్నారు. అయితే నిజం ఏంటంటే ఈ వీడియో ఇప్పటిది కాదు. నాగ చైతన్య మరియు అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన శైలజా రెడ్డి అల్లుడు సినిమా ప్రమోషన్స్‌లో ఇది జరిగింది. అయితే అప్పట్లో నాగ చైతన్య, సమంతలు భార్యాభర్తలుగా కలిసి చాలా ఆనందంగా ఉన్నారు.
ఈ వీడియో చూసిన సమంత అభిమానులు నాగ చైతన్య, సమంత ను దారుణంగా మోసం చేశాడని నమ్ముతున్నారు. శైలజా రెడ్డి అల్లుడు ప్రమోషన్స్‌లో ఇమ్మాన్యుయేల్ నాగ చైతన్య ఇంకేదో మాట్లాడుతుండగా ఈ వీడియో వచ్చింది. అయితే ఆ వీడియో ను కట్ చేసి సమంతకు నాగ చైతన్య ద్రోహం చేశాడంటూ కొందరు ఆన్లైన్ లో సర్క్యులేట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.