Naga Chaitanya : సమంత తో విడాకులు తీసుకున్న తర్వాత అక్కినేని నాగ చైతన్య రెండవ పెళ్లి గురించి సోషల్ మీడియా లో ఎన్నో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. నాగ చైతన్య ప్రముఖ స్టార్ హీరోయిన్ శోభిత దూళిపాళ్ల ని ప్రేమిస్తున్నాడని, త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని నాగ చైతన్య ఒకసారి సున్నితంగా కొట్టిపారేశాడు(Nagachaitanya second marriage). ఇక శోభిత దూళిపాళ్ల చాలా స్ట్రాంగ్ గా ఈ వార్తలపై స్పందించి కొట్టిపారేసింది. కానీ వీళ్లిద్దరు కలిసి డిన్నర్స్ వెళ్లడం, ప్రైవేట్ పార్టీలు వరల్డ్ టూర్స్ వెయ్యడం వంటివి చూసి వీళ్ళు ప్రేమలో లేరు అంటే నమ్మలేకపొతున్నారు ఫ్యాన్స్.
ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు నాగ చైతన్య రెండవ పెళ్లి గురించి మరో కొత్త వార్త సోషల్ మీడియా లో ప్రచారం అవుతుంది, అదేమిటి అంటే నాగ చైతన్య రెండవ పెళ్లి కి పెళ్లి కూతురు సెలక్షన్ రీసెంట్ గానే జరిగిపోయింది అట. అందరూ అనుకున్నట్టు శోభిత దూళిపాళ్లతో నాగ చైతన్య పెళ్లి జరగడం లేదు. ఒక ప్రముఖ బిజినెస్ మ్యాగ్నెట్ కూతురుతో ఘనంగా జరగబోతుంది అట(Nagachaitanya second marriage). ఇండస్ట్రీ లో ఉన్న హీరోయిన్స్ తో అచ్చిరాదని, ఈ కాలం అమ్మాయిలు మా జనరేషన్ లో ఉన్నట్టుగా లేరని, సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మళ్ళీ కష్టాలు తప్పవు అంటూ నాగార్జున హెచ్చరించాడట.
అందుకే నాగ చైతన్య హీరోయిన్స్ వైపు కన్నెత్తి కూడా చూడకుండా బుద్ధిగా ఇంట్లో చెప్పిన సంబంధం ని చేసుకుంటున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. త్వరలోనే ఈ రెండవ పెళ్ళికి సంబంధించిన శుభవార్త అధికారికంగా తెలియచెయ్యబోతున్నాడట నాగ చైతన్య. ఇక నాగ చైతన్య సినిమాల విషయానికి వస్తే నిన్న మొన్నటి వరకు వరుస విజయాలతో దూసుకుపోయిన ఆయన కెరీర్, గత ఏడాది నుండి డేంజర్ లో జోన్ లో పడిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయన నటించిన ‘థాంక్యూ’ చిత్రం పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇక ఈ ఏడాది వెంకట్ ప్రభు దర్శకత్వం లో వచ్చిన ‘కస్టడీ’ చిత్రం కూడా డిజాస్టర్ అయ్యింది.
ఇప్పుడు నాగ చైతన్య చందు మొలేటి దర్శకత్వం లో గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. ఈ సినిమా మీదనే ఆయన కోటి ఆశలు పెట్టుకున్నాడు. మరి ఆయన కెరీర్ ని మలుపు తిప్పే చిత్రంగా నిలుస్తుందో లేదో చూడాలి. ప్రస్తుతం ఐతే నాగ చైతన్య చేతిలో ఎటువంటి సినిమాలు లేక కాలిగా ఉన్నాడు అనే చెప్పాలి. మొన్న సముద్రపు జాలరులని కలిసి నాగ చైతన్య వారి పై ఏదో సినిమా ప్లాన్ చేసాడు.
సమంత నాగ చైతన్య విడాకులు తీసుకున్నప్పటినుండి ఇద్దరికి పెద్దగా కలిసి రావటం లేదు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరికి కూడా ఒక మంచి హిట్ లేదు. మరి నాగ చైతన్య ఫ్యూచర్ ప్లాన్ ఏంటో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే.