Home Cinema Kasturi: నీ రేటు గంటకి 5 వేలు కదా.. నటి కస్తూరి పై చెండాలపు కామెంట్స్..

Kasturi: నీ రేటు గంటకి 5 వేలు కదా.. నటి కస్తూరి పై చెండాలపు కామెంట్స్..

Kasturi: ఇండస్ట్రీ లో కొంతమంది సీనియర్ హీరోయిన్స్ ఇప్పటికీ వరుసగా సినిమాలు చేస్తూ బిజీ ఆర్టిస్ట్స్ గా కొనసాగుతున్నారు. అలాంటి సీనియర్ హీరోయిన్స్ లో ఒకరు కస్తూరి శంకర్. ఈమె గతం లో తెలుగు మరియు తమిళం భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించి స్టార్ గా ఎదిగింది(Kasturi shankar remuneration). ముఖ్యంగా అక్కినేని నాగార్జున హీరో గా నటించిన అన్నమయ్య సినిమాలో, నాగార్జున కి ఉన్న ఇద్దరు మరదళ్లలో ఒకరు రమ్య కృష్ణ కాగా, మరొకరు కస్తూరి. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వడం తో కస్తూరి కి మన టాలీవుడ్ లో వచ్చిన ఫేమ్ అంతా ఇంతా కాదు.

kasturi-shankar

మన తెలుగు ఆడియన్స్ కి ఈమె బుల్లితెర ద్వారా మరింత చేరువ అయ్యింది. స్టార్ మా ఛానల్ లో టాప్ టీఆర్పీ రేటింగ్స్ దక్కించుకున్న ‘గృహలక్ష్మి’ సీరియల్ లో తులసి పాత్ర ద్వారా ఈమె దక్కించుకున్న క్రేజ్ మామూలుది కాదు. వీటితో పాటు పలు సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా విభిన్నమైన పాత్రలు పోషిస్తూ ముందుకు దూసుకుపోతుంది. పలు వెబ్ సిరీస్ లలో కూడా ఈమె నటించడం విశేషం. ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియా లో ఈమె ఎప్పుడూ వివాదాల్లోనే ఉంటుంది. తన మనసుకి అనిపించినా భావాలను నిర్మొహమాటంగా తెలియచేయడం ఈమె స్టైల్.

దాని తర్వాత పరిణామాలు ఎలా ఉన్న ఈమె పట్టించుకోదు(Kasturi shankar remuneration). ఇలా ముక్కుసూటి తనం ఉండడం వల్ల నెటిజెన్స్ నుండి ఘోరమైన నెగటివ్ కామెంట్స్ ని ఎదురుకోవాల్సి వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇకపోతే ఈమె తమిళం లో బిగ్ బాస్ సీజన్ 3 లో ఒక కంటెస్టెంట్ గా వ్యవహరించింది. ఈమెతో పాటుగా వనితా విజయ్ కుమార్ కూడా ఒక కంటెస్టెంట్ గా పాల్గొన్నది. ఇప్పుడు ఆమె సోదరి జోవిక విజయ్ కుమార్ కూడా బిగ్ బాస్ సీజన్ 7 లో పాల్గొంటుంది. దీని పై మీ అభిప్రాయం ఏమిటి అని కస్తూరి ని ఒక నెటిజెన్ అడగగా.

ఒకే ఇంట్లో ఉంటూ ఆర్టిఫీషియల్ ఎమోషన్స్ ని చూపించే ఆ రియాలిటీ షో అంటే నాకు చాలా చిరాకు, దాని గురించి నన్ను అడగకండి అని చెప్పింది. అప్పుడు నెటిజెన్స్ ఈమెపై తీవ్రంగా విమర్శలు చేసారు. ఇలాంటి అభిప్రాయం ఉన్నప్పుడు బిగ్ బాస్ లో ఎందుకు పాల్గొన్నావు అని కొందరు, మరి కొంతమంది అయితే నీకు గంటకి 5 వేలు అంట కదా అని చాలా నీచమైన అర్థం వచ్చేలా కామెంట్స్ చెయ్యడం ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ టాపిక్ గా మారింది.

Exit mobile version