Nagarjuna Varun Sandesh: ఇండస్ట్రీ లో బ్యాక్ గ్రౌండ్ లేని హీరో సక్సెస్ అవ్వాలంటే చాలా కష్టం. టాలెంట్ తో పాటుగా బోలెడంత అదృష్టం కూడా ఉండాలి. ఆ రేండు ఉన్నప్పుడే సక్సెస్ అవుతారు. చిరంజీవి, రవితేజ, విజయ్ దేవరకొండ, నాని వంటి బ్యాక్ గ్రౌండ్ లేని హీరోలకు టాలెంట్ తో పాటు అదృష్టం కలిసి రావడం వల్లే ఇండస్ట్రీ లో నేడు ఈ స్థాయిలో ఉన్నారు. కానీ కొంతమంది హీరోలు మాత్రం బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి తార జువ్వ లాగ పైకి ఎగసి, వెంటనే పాతాళ లోకం లోకి పడిపోయారు.
అలాంటి హీరోలలో ఒకరు వరుణ్ సందేశ్. ఇతను హ్యాపీ డేస్ సినిమా సమయం లో శేఖర్ కమ్ముల నిర్వహించిన ఆడిషన్స్ ద్వారా ఆ చిత్రం లో హీరో గా నటించే ఛాన్స్ కొట్టేసాడు. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది, యూత్ లో వరుణ్ సందేశ్(Nagarjuna Varun Sandesh) కి మంచి పేరుని తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత ఆయన చేసిన రెండవ చిత్రం ‘కొత్త బంగారు లోకం’ కూడా మంచి హిట్ అయ్యింది. ఇక వరుణ్ సందేశ్ కి తిరుగు లేదు, టాలీవుడ్ లో మరో టాలెంటెడ్ హీరో స్టార్ అవ్వబోతున్నారు అని అందరూ అనుకున్నారు.
కానీ సరైన స్క్రిప్ట్ సెలక్షన్ లేకపోవడం తో పాటుగా, కొన్ని ఒప్పుకున్న మంచి సినిమాలు కూడా చెయ్యి జారిపోవడం వల్ల వరుణ్ సందేశ్ కెరీర్ గాల్లో కలిసిపోయింది. అసలు విషయానికి వస్తే అక్కినేని నాగ చైతన్య సుకుమార్ కాంబినేషన్ లో 100 పర్సెంట్ లవ్ అనే చిత్రం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. తొలుత ఈ చిత్రాన్ని వరుణ్ సందేశ్ తోనే చెయ్యాలని అనుకున్నాడట సుకుమార్. కానీ సుకుమార్ దగ్గర ఈ స్క్రిప్ట్ ఉందని గీత ఆర్ట్స్ ద్వారా తెలుసుకున్న నాగార్జున, వెంటనే ఆరోజు రాత్రి ఇంటికి పిలిచి ఈ సినిమా చైతూ తో చెయ్యమని రిక్వెస్ట్ చేసాడట.
అంత పెద్ద హీరో అడిగితే కొత్తగా ఇండస్ట్రీ కి వచ్చిన డైరెక్టర్స్ ఏమి చెయ్యగలరు ఓకే చెప్పకుండా? సుకుమార్ కూడా అలాగే చేసాడు. ఫలితంగా బంగారం లాంటి సినిమా చెయ్యి జారిపోయింది వరుణ్ చేతుల్లో నుండి. అలా ఒక్క రాత్రిలో వరుణ్ సందేశ్ జాతకం మొత్తం మారిపోయింది పాపం. హ్యాపీ డేస్ సినిమా లో నటించిన వారందరు మంచి స్టేజి కి వచ్చేసారు. కానీ నాగార్జున వల్ల వరుణ్ సందేశ్ కెరీర్ నాశనం ఐపోయింది.