Home Cinema Nagarjuna : నాగార్జునపై మండిపడుతున్న సొంత ఫ్యాన్స్.. క్షమాపనులు తెలిపారు..

Nagarjuna : నాగార్జునపై మండిపడుతున్న సొంత ఫ్యాన్స్.. క్షమాపనులు తెలిపారు..

nagarjuna-own-fans-are-angry-on-him-after-watching-this-trending-video

Nagarjuna : ఒక ప్రముఖ స్టార్ హీరో బయట ఎక్కడైనా కనిపించినప్పుడు జనాలు సాధారణంగా ఫోటోలు తీయడానికి పరుగెత్తుతారు. ఇది చాలా తరచుగా జరగడం మనం చూస్తూనే ఉంటాము. అదే మన ఫేవరేట్ హీరోని చూస్తే చుట్టుపక్కల ఎవరున్నారో పట్టించుకోము. హీరో దగ్గరకు పరిగెత్తుకెళ్లి ఫోటో దిగాలనే ఆసక్తిని వ్యక్తం చేస్తాం. అయితే కొందరు హీరోలు ప్రేమతో సెల్ఫీలు ఇస్తే, మరికొందరు బాడీగార్డుల చేత పక్కకు నెట్టివేయబడుతారు. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది.

ఆ వీడియోలో అక్కినేని నాగార్జున ఉండటం గమనరహం. నిన్నటి నుంచి ఇంట‌ర్నెట్‌లో ఈ ఆస‌క్తిక‌ర‌మైన వీడియో హ‌ల్‌ చ‌ల్ చేస్తోంది. ఈ వీడియోలో స్పెషల్ ఎబిలిటీ అభిమాని నాగార్జున ను చూసి సెల్ఫీ తీసుకోవడానికి వచ్చినప్పుడు, బాడీగార్డు ఒకరు అతనిని తోసేశాడు. ఈ సంఘటన బాగా వైరల్ అయింది. ఇది దక్షిణాదికి మాత్రమే కాకుండా ఉత్తరాది ఇండస్ట్రీలో కూడా వ్యాపిస్తుంది. దీంతో చాలా మంది నాగార్జున పై విమర్శలు గుప్పించారు. దీంతో అక్కినేని అభిమానులు కూడా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలా ఇంటర్నెట్ లో చెక్కర్లు కొట్టి కొట్టి ఈ విషయం నాగార్జున దాకా వెళ్ళింది. అయితే ఇటీవల ఆయన దీనిపై ఎట్టకేలకు స్పందించారు. ఎయిర్‌పోర్టు నుంచి నాగార్జున బయటకు రావడం చూసిన ఓ అభిమాని ఆయనతో సెల్ఫీ దిగేందుకు వచ్చారు. ఇది చూసిన నాగార్జున సిబ్బంది అతన్ని పక్కకు తోసేసారు. నాగార్జున ఈ సంఘటన జరిగినందుకు బాధపడుతున్న, నా వద్దకు ఈ వీడియో ఇపుడే వచ్చింది. ఆ జెంటిల్ మ్యాన్ కు నా క్షమాపణలు అని ట్విట్టర్ ద్వారా తెలిపారు. దీనితో ఈ వార్తా ఇంటర్నెట్ లో సంచలనం రేపుతోంది.

Exit mobile version