Home Cinema Kalki 2898 AD : ప్రభాస్ సినిమాకు తలనొప్పిగా మారిన హీరో రాజశేఖర్.. కోపంలో ఫాన్స్..

Kalki 2898 AD : ప్రభాస్ సినిమాకు తలనొప్పిగా మారిన హీరో రాజశేఖర్.. కోపంలో ఫాన్స్..

Kalki 2898 AD : ప్రస్తుతం ఇదే వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించిన ప్రభాస్ నటించిన సినిమా కల్కి 2898 AD మరికొద్ది రోజుల్లో విడుదల కానుంది. ఈ సినిమా ఈ గురువారం మన ముందుకు రాబోతుంది. కల్కి సినిమా కోసం ప్రభాస్ అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో థియేటర్లలో అభిమానుల సందడి నెలోకొంది. మరీ ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ అందరిని ఆశ్చర్యపరిచింది.

ఇదిలా ఉంటే, తాజాగా కల్కి చిత్రానికి సంబంధించిన ఓ వార్త వైరల్‌ గా మారింది. కల్కి సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామని టిక్కెట్ల బుకింగ్‌పై అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ క్రమంలో కొందరు తమకు తెలియకుండానే రాజశేఖర్ సినిమా కల్కికి టిక్కెట్లు బుక్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు కల్కి 2898 AD సినిమా టికెట్ బుకింగ్ విషయంలో చాలా గందరగోళం నెలకొంది. కూకట్ పల్లిలోని భ్రమరాంబ లాంటి థియేటర్లో ప్రభాస్ కల్కికి బదులు రాజశేఖర కల్కికి టిక్కెట్లు బుక్ అయ్యాయి.

rajasekhar-kalki-cinema-is-being-big-headache-to-prabhas-kalki-2898-cinema

ఇది ఒక టెక్నికల్ ఇష్యూ గా పరిగణిస్తున్నారు. అంతేకాదు ఈ కారణంగానే రాజశేఖర్ సినిమా దాదాపు ఆరు స్క్రీన్లు నిండిపోయాయి. బుక్ మై షో పై అభిమానులు మరియు నెటిజనులు తీవ్ర అసంతృప్తిని తెలుపుతున్నారు. అయితే దీనిపై బుక్ మై షో స్పందించింది. అదే టిక్కెట్లతో కల్కి 2898 AD సినిమాకు రావొచ్చు అని తెలిపారు. ప్రేక్షకులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇంటర్నెట్ ద్వారా స్పష్టం చేశారు. దీనికి హీరో రాజశేఖర్ కూడా సరదాగా స్పందించాడు. నా బెస్ట్ విషెస్ అంటూ పోస్ట్ ను కూడా విడుదల చేసారు.

Exit mobile version