Home Cinema Nagarjuna: ఆడ పిల్ల పుడుతుంది అనుకోని నాగార్జున అమల ఏంచేశారంటే..

Nagarjuna: ఆడ పిల్ల పుడుతుంది అనుకోని నాగార్జున అమల ఏంచేశారంటే..

Nagarjuna Wants Baby Girl: సౌత్ లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న జంటల్లో ఒకటి అక్కినేని నాగార్జున – అమల జంట. శివ సినిమాతో పరిచయమైన వీళ్లిద్దరి స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారి పెళ్లి కూడా చేసుకున్నారు. వీళ్లిద్దరికీ అక్కినేని అఖిల్ పుట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయన టాలీవుడ్ లో క్రేజీ యంగ్ హీరోస్ లో ఒకడిగా కొనసాగుతున్నాడు. మంచి క్రేజ్ ఉన్నప్పటికీ పాపం ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఇన్నాళ్లు అయినా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలైన ఏజెంట్ చిత్రం కూడా డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది.

nagarjuna-wants-baby-girl

ఇదంతా పక్కన పెడితే అఖిల్ అంటే అటు నాగార్జున కి కానీ, ఇటు అమల కి కానీ ఎంతో ప్రత్యేకం.అఖిల్ పుట్టబోయే ముందు జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ అయ్యి తెగ వైరల్ గా మారింది. పెళ్ళైన కొత్త లో అమల గర్భం దాల్చినప్పుడు పుట్టేది ఆడబిడ్డ లేదా మగబిడ్డ అనేది తెలుసుకునేందుకు అమెరికా కి వెళ్లి టెస్టులు చేయించారట. టెస్టులు చేయించినప్పుడు ఆడబిడ్డ పుడుతుందని చెప్పారట డాక్టర్స్. నాగార్జున కి ఆడబిడ్డ పుట్టాలని మనసులో చాలా కోరిక ఉండేది అట. డాక్టర్ కూడా అదే చెప్పడంతో నాగార్జున సంతోషానికి హద్దులే లేకుండా పోయాయి.

ఆడ బిడ్డ పుడుతుందనే సంతోషం తో ఆడపిల్లకు అవసరం అయ్యే వస్తువులు, దుస్తులు అన్నీ కూడా తెచ్చిపెట్టాడట నాగార్జున(Nagarjuna wants baby girl). కానీ తీరా అఖిల్ పుట్టేలోపు ఆయన చాలా నీరసకి గురి అయ్యాదట. ఇంత పెద్ద వృత్తి చేస్తూ అబద్దాలు చెప్పాలని ఎలా అనిపించిందో అని ఆ డాక్టర్ ని బాగా తిట్టుకున్నాడట. ఈ విషయం చాలా ఏళ్ళ తర్వాత బయటపడడం తో సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎవరైనా మగబిడ్డ కావాలని ప్రార్థనలు చేస్తారు. కానీ ఆడబిడ్డ కోసం ఇంతలా పరితపించిన హీరో కేవలం అక్కినేని నాగార్జున మాత్రమే అని అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు.

ఇకపోతే నాగార్జున ‘ది ఘోస్ట్ ‘ సినిమా తర్వాత మూవీస్ కి బాగా గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రసన్న కుమార్ తో సినిమా చెయ్యబోతున్నాడు అని తెలుసు కానీ ఇప్పటి వరకు ఆ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కలేదు. ఇకపోతే త్వరలోనే ఆయన బిగ్ బాస్ తెలుగు సరికొత్త సీజన్ తో మన ముందుకు రాబోతున్నాడు. ఈ నెలలోనే ఈ సీజన్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. రీసెంట్ గా విడుదల చేసిన ప్రోమో కి ఆడియన్స్ నుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అఖిల్ మాత్రం ఏజెంట్ సినిమా డిసాస్టర్ నుండి ఇంకా కోలుకోలేదు అనే చెప్పాలి. చూదాం ఇప్పటి నుండైనా అఖిల్ మంచి స్టోరీ ఉన్న సినిమాలు సెలెక్ట్ చేసుకుంటాడో లేదో.

Exit mobile version