Nagarjuna Warning: టాలీవుడ్ లో అక్కినేని నాగార్జున ఏ పని చేసిన చాలా అలోచించి క్యాలుకులేటడ్ గా చేస్తాడనే విషయం అందరికీ తెలిసిందే. అది స్క్రిప్ట్ సెలక్షన్ లో అయినా వ్యాపార లావాదేవీలలో అయినా నాగార్జున మార్కు వేరే. అందుకే ఆయన రెండు రంగాల్లోనూ గొప్పగా రాణించాడు. ఇకపోతే పిల్లల విషయం లో కూడా నాగార్జున ఎంతో జాగ్రత్తలు వహిస్తూ పెంచాడనే సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆయన చిన్న తనయుడు అక్కినేని అఖిల్ అంటే నాగార్జున కి ఎంత ఇష్టమో మనమంతా చూస్తూనే ఉన్నాము. ఇతనిని ఎంతో అపురూపం గా, గాజుబొమ్మ లాగ పెంచాడు.
అయితే అఖిల్ స్క్రీన్ ప్రెజెన్స్ వేరే లెవెల్ లో ఉండేసరికి కచ్చితంగా ఈయన ఇండస్ట్రీ లో పెద్ద సూపర్ స్టార్ రేంజ్ కి వెళ్లాడని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు అఖిల్ క్లీన్ హిట్ కొట్టలేదు, ఇది అక్కినేని అభిమానులు జీర్ణించుకోలేని విషయం అని చెప్పొచ్చు. అయితే అఖిల్ ఇప్పుడు హిట్ కొట్టలేదు కానీ, దోగాడే వయస్సులోనే ఆయన సూపర్ హిట్ కొట్టాడు అనే విషయం అందరికీ తెలుసు. శివ నాగేశ్వర రావు(Nagarjuna Warning) దర్శకత్వం లో అఖిల్ కి ఏడాది వయస్సు ఉన్న సమయం లో తీసిన చిత్రం ‘సిసింద్రీ’. ఇంగ్లీష్ లో సూపర్ హిట్ గా నిల్చిన ఒక సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఆరోజుల్లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
ముఖ్యంగా అఖిల్ ఇందులో ఎంతో ముచ్చటగా కనిపించాడు. అయితే ఈ సినిమాలో అఖిల్ ని నటింపచేయడానికి నాగార్జున ఏమాత్రం ఒప్పుకోలేదట. శివ నాగేశ్వర రావు ఈ సినిమా స్క్రిప్ట్ ని వినిపించి, అఖిల్ తో చేద్దాం అనుకుంటున్నాను, దయచేసి మీ బాబు ని కొన్ని రోజులు నాకు ఇవ్వండి అని అడిగాడట. చిన్న పిల్లాడు అయ్యా, ఏడాది కూడా నిండలేదు, వాడితో ఏమి సినిమా చేస్తావ్, వదిలేయ్ అని అన్నాడట. కానీ శివ నాగేశ్వర రావు పట్టువదలని విక్రమార్కుడు లాగ, నాగార్జున ని పట్టుబట్టి ఒప్పించాడట.
అయితే నాగార్జున అఖిల్ ని శివ నాగేశ్వర రావు చేతిలో పెట్టే ముందు, జాగ్రత గా చూసుకో, నిన్ను నమ్మి ఇస్తున్నాను, వాడి మీద చిన్న గీత పడినా మీ అంతు చూస్తాను అని వార్నింగ్ ఇచ్చి పంపించాడట. ఇక ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వెళ్లడం, అది సూపర్ హిట్ అవ్వడం జరిగింది. నాగార్జున ఐతే తన ఫ్రెండ్స్ పిల్లలను చూసి చాల ఈర్ష పడుతున్నాడు అనే చెప్పాలి. చిరంజీవి కొడుకు రామ్ చరణ్ వరల్డ్ స్టార్ అయ్యాడు, కానీ అక్కినేని కుటుంబానికి హిట్లు పడటమే కష్టం అయింది. ఏదో ఒకటి చేసి కొడుకులని పాన్ ఇండియా స్టార్ చేయాలి అని ఫిక్స్ అయ్యాడు నాగార్జున. మరి వేచి చూడాలి ఏ డైరెక్టర్ ముందుకు వస్తాడో సినిమా చేయటానికి.