Home Cinema Rajinikanth – Nani : సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో నాని.. రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Rajinikanth – Nani : సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో నాని.. రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Rajinikanth – Nani : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా నటించిన ‘జైలర్’ చిత్రం మరో 5 రోజుల్లో మన ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పాటలు, ట్రైలర్ , టీజర్ అన్నీ కూడా అభిమానులు మరియు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకున్నాయి. చాలా కాలం నుండి సరైన సూపర్ హిట్ లేక ఇబ్బంది పడుతున్న రజినీకాంత్ ఈ చిత్రం భారీ కం బ్యాక్ ఇవ్వబోతున్నాడు అనే విషయం అందరికీ అర్థం అయ్యింది.

nani-cameo-in-rajinikanth-movie-here-are-the-remuneration-details

దానికి తగ్గట్టుగానే ఇన్ సైడ్ సమాచారాలు కూడా చాలా పాజిటివ్ గా ఉన్నాయి. ఇందులో తమన్నా హీరోయిన్ గా నటించగా, మోహన్ లాల్ , శివ రాజ్ కుమార్ తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ చిత్రం తర్వాత రజినీకాంత్ విష్ణు విశాల్ హీరో గా నటిస్తున్న ‘లాల్ సలాం’ అనే చిత్రం లో ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. ఈ చిత్రం తర్వాత ఆయన ‘జై భీం’ దర్శకుడు జ్ఞానవేల్ రాజా తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు.

సినిమాలో మన న్యాచురల్ స్టార్ ఒక ముఖ్యమైన పాత్ర పోషించబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఇంకా టైటిల్ కూడా ఖరారు కానీ ఈ రజినీకాంత్ 170 వ చిత్రం లో నాని పాత్ర సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లే విధంగా ఉంటుందట. పాత్ర నిడివి కేవలం 20 నిమిషాలే అయ్యినప్పటికీ, చిరకాలం గుర్తుండిపోయే రేంజ్ లో ఆ పాత్ర ఉంటుందని. కచ్చితంగా అభిమానులకు కనుల పండుగ లాగ ఉండబోతుందని టాక్.

నాని ఈ ఏడాది ‘దసరా’ సినిమాతోనే పాన్ ఇండియా లెవెల్ లో అన్నీ ప్రాంతీయ బాషా ప్రేక్షకులను పలకరించాడు. కానీ తెలుగు లో తప్ప ఈ సినిమా ఎక్కడా కూడా సరిగా ఆడలేదు. తమిళ ఆడియన్స్ అయితే ఈ చిత్రాన్ని అసలు పట్టించుకోలేదు కూడా. ఇలాంటి సమయం లో నాని తమిళ ఆడియన్స్ కి దగ్గరయ్యే మార్గం ఈ చిత్రం ద్వారా దక్కుతుందని అంటున్నారు ఆయన అభిమానులు.

ప్రస్తుతం నాని ‘హాయ్ నాన్న’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత ఆయన ఎలాంటి సినిమాకి కూడా కమిట్ అవ్వలేదు. ఈ గ్యాప్ లో రజినీకాంత్(Rajinikanth Nani) తో చెయ్యబోయే సినిమాని పూర్తి చేసే ఉద్దేశ్యం తో ఉన్నట్టు సమాచారం. మరి ఈ సినిమా నాని కెరీర్ ని ఎలా మలుపు తిప్పుతుందో చూడాలి.

Exit mobile version