Home Cinema Samantha: 25 కోట్లు ఆ హీరో దెగ్గర అప్పు.. మొదటిసారి స్పందించిన సమంత..

Samantha: 25 కోట్లు ఆ హీరో దెగ్గర అప్పు.. మొదటిసారి స్పందించిన సమంత..

Samantha: సౌత్ ఇండియా లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న సమంత, గత కొంత కాలం వరకు ‘మయోసిటిస్’ వ్యాధితో బాధపడిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ ప్రాణాంతక వ్యాధి నుండి సురక్షితంగా బయటపడిన సమంత, అంతకు ముందు ఒప్పుకున్నా ‘ఖుషి’ మరియు ‘సిటాడెల్’ సినిమాల షూటింగ్స్ ని పూర్తి చేసింది(Samantha Responds About Debts). ఖుషి చిత్రం వచ్చే నెల 1 వ తేదీన విడుదల కాబోతుండగా, ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ అతి త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. అయితే సమంత మయోసిటిస్ వ్యాధి నుండి కోలుకున్న విషయం వాస్తవమే కానీ, పూర్తి స్థాయిలో మాత్రం కోలుకోలేదు.

samantha-25-crores

అందుకే షూటింగ్స్ కి కొంతకాలం బ్రేక్ ఇచ్చి, అమెరికా లో తుది ట్రీట్మెంట్ తీసుకునేందుకు సిద్ధం అవుతుంది. ప్రస్తుతం తన స్నేహితురాలితో కలిసి హాలిడే ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్న సమంత, ఈ ట్రిప్ పూర్తి అవ్వగానే అమెరికా కి బయలుదేరనుంది. అయితే గత రెండు రోజుల నుండి సమంత అమెరికా లో చికిత్స తీసుకునేందుకు ఒక ప్రముఖ స్టార్ హీరో వద్ద పాతిక కోట్ల రూపాయిలు అప్పు తీసుకుంది అంటూ ఒక రూమర్ సోషల్ మీడియా లో ప్రచారం అయ్యింది. ఇలాంటి రూమర్స్ వచ్చినప్పుడు వెంటనే స్పందించే తత్త్వం ఉన్న సమంత ఈ రూమర్ పై కూడా స్పందించింది.

ఆమె మాట్లాడుతూ ‘మయోసిటిస్ ట్రీట్మెంట్ కోసం పాతిక కోట్లు ఖర్చు అవుతుందా..? నేను ఒక స్టార్ హీరో వద్ద అప్పు తీసుకున్నానా? ఇలాంటి రూమర్స్ విన్నప్పుడు నవ్వు వస్తుంది(Samantha Responds About Debts). అసలు మయోసిటిస్ వ్యాధికి అంత ఖర్చు అవ్వదు, వేలాది మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. కాబట్టి బాధ్యతగల పౌరులుగా ఇలాంటి అసత్య ప్రచారాలు చెయ్యొద్దు. నేను సినిమాల ద్వారా బాగానే సంపాదించాను, నాకు ఒకరిదగ్గర అప్పులు తీసుకోవాల్సిన అవసరం ఆ దేవుడు నాకు కల్పించలేదు’ అంటూ సమంత తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలియచేసింది.

ఆమె మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న దగ్గర నుండి సమంత పై ప్రతీ రోజు సోషల్ మీడియా లో ఎదో ఒక వార్త ప్రచారం అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ వార్తలపై సమంత అసహనం వ్యక్తం చేస్తూ కోర్టులో కేసు కూడా వేసింది. అయ్యినప్పటికీ ఆమెపై రూమర్స్ ఆగడం లేదు. సమంత ప్రస్తుతం తన ఫ్రెండ్స్ తో బాలి దేశంలో హాలిడేస్ ఎంజాయ్ చేస్తుంది. తరువాత ట్రీట్మెంట్ తీసుకుని అన్ని సరైపోయాకే మల్లి సినిమాల్లోకి వస్తుంది అంట.

Exit mobile version