Sunday, October 6, 2024
HomeCinemaNaresh : పవన్ కళ్యాణ్ పై సంచలన కామెంట్స్ చేసిన నరేష్.. ఏమన్నాడంటే..

Naresh : పవన్ కళ్యాణ్ పై సంచలన కామెంట్స్ చేసిన నరేష్.. ఏమన్నాడంటే..

Naresh : సోష‌ల్ మీడియాలో సినిమా పరిశ్రమకు సంబందించిన వారు ఏం చెప్పినా ఈమ‌ధ్య పెద్ద ట్రెండ్‌గా మారుతుంది. ఇళ్ల ఎన్నో వార్తలు ఇంటర్నెట్ లో సంచలనంగా మారడం మనం చూసాము. అయితే, తాజాగా సీనియర్ నటుడు నరేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నో మంచి పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇటీవ‌ల ఏపీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి మ‌ద్ద‌తు ఇస్తూ ట్వీట్ కూడా చేశాడు.

ఇప్పుడు నరేష్ పవన్ కళ్యాణ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. పవన్ కళ్యాణ్ డైనమిక్ పర్సన్ అని, అలాంటి వాళ్లు రాజకీయాల్లో ఉండాలని ఆయన అన్నారు. తాజాగా నరేష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నాకు స్ట్రెయిట్ గా మాట్లాడే వాళ్లంటే ఇష్టం. ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తులు మనముందు ఒకలా మన వెనుక ఒకలా మాట్లాడారు. ధైర్యంగా, చైతన్యవంతంగా మరియు హృదయపూర్వకంగా ఉంటారు. నాకు అందుకే ఇలాంటి వాలంటే చాలా ఇష్టం. నేను చెన్నైలో నివసిస్తున్నప్పటి నుండి పవన్ కళ్యాణ్‌తో పరిచయం ఉంది.

naresh-comments-about-pawan-kalyan

ఆయనను నేను ఎన్నో సంవస్త్రాల నుండి చూస్తున్నాను. ఏమీ లేనప్పుడు, అతను ప్రజాలకు అనేక కోట్లు దానం చేసాడు. అదే ఆయనకు అధికారం వస్తే ప్రజలకు ఏం చేస్తాడో మీరే ఆలోచించండి. ప్రజలకు సేవ చేయాలనే తపన ఉంది పవన్ లో. ఎన్టీ రామారావు తరువాత పవన్ కళ్యాణ్ కు ఇది ఉంది. పవన్ కళ్యాణ్ తన వారాహితో ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు అంటూ నరేష్ పవన్ పై ప్రశంసలు కురిపించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓ హై ను ఇస్తున్నాయి.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts