Niharika Tarun Marriage: సోషల్ మీడియా లో ఈమధ్య రేటింగ్స్ కోసం కొన్ని వెబ్ సైట్స్ సెలెబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై అనేకమైన పుకార్లు నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఒక లిమిట్ వరకు ఎవరైనా చూసి చూడనట్టు ఉంటారు కానీ, హద్దులు దాటినప్పుడు మాత్రం సెలెబ్రిటీలు చాలా హర్ట్ అయిపోయి, ప్రత్యేకంగా పత్రిక ప్రకటనలు విడుదల చేస్తుంటారు. మరికొంత మంది సెలెబ్రిటీలు అయితే ఇలాంటి తప్పుడు వార్తలు పుట్టించినందుకు సదరు వెబ్ సైట్ పై కఠినమైన చర్యలు తీసుకునేందుకు సిద్ద పడుతుంటారు. రీసెంట్ గా సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ అయిన వార్త, హీరో తరుణ్ నాగబాబు కూతురు నిహారిక ని పెళ్లి చేసుకోబోతున్నాడు అని.
ఈ వార్త ఇండస్ట్రీ ని షేక్ చేసింది. ఇది తరుణ్ దాకా చేరేలోపు ఆయన వెంటనే రియాక్ట్ అయ్యి, ఆ అసత్య వార్తలను ఖండించాడు(Niharika Tarun Marriage). ఆయన మాట్లాడుతూ ‘నా పెళ్లిపై గత రెండు మూడు రోజుల నుండి సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవం, ఏదైనా ఉంటే నేనే స్వయంగా చెప్తాను కదా, ఎన్ని సార్లు ఈ విషయం గురించి చెప్పినా ఈ పుకార్లు ఎలా పుట్టిస్తున్నారో అర్థం కావడం లేదు’ అంటూ తరుణ్ వివరణ ఇచ్చాడు. ఇక రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న నిహారిక కూడా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది.
ఆమె మాట్లాడుతూ ‘ఇన్నాళ్లు నుండి ఇద్దరం ఇండస్ట్రీ లో ఉన్నాం, కానీ ఒక్కసారి కూడా మేము బయట కలుసుకుంది లేదు, మాట్లాడుకుంది లేదు. కనీసం ఫోన్ లో కూడా మాట్లాడుకోలేదు, మా మీద ఇలాంటి పుకార్లు పుట్టించే ఆలోచన ఎవరికి వచ్చిందో, ఈ జనాలకు వారి వ్యక్తిగత విషయాలకంటే కూడా, ఎదుటి మనిషి వ్యక్తిగత విషయాలపై శ్రద్ద మరలుతుంది’ అంటూ నిహారిక చెప్పుకొచ్చింది(Niharika Tarun Marriage). రీసెంట్ గానే నిహారిక తన భర్త చైతన్య తో విడాకులు తీసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఆమె విడాకులు ఎందుకు తీసుకుంది అనేది చాలా మందికి ఇప్పటి వరకు తెలియదు.
నిహారిక కూడా ఈ విడాకుల ప్రస్తావన ని ఎక్కడా తీసుకొని రాలేదు. చాలా కాలం వరకు సినిమాలకు దూరమైనా నిహారిక, విడాకులు తర్వాత మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఫుల్ బిజీ గా మారిన నిహారిక, త్వరలోనే వెండితెర మీద కూడా కనిపించబోతుంది. నిహారిక ఇటీవలే తీసిన వె సిరీస్ ఫెయిల్ అయ్యింది. డిస్నీ హాట్ స్టార్ లో ఉన్న ఈ సిరీస్ ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేదు అనే చెప్పాలి. దీనితో, నిహారిక కూడా మల్లి సినిమాలకు తిరిగి వచ్చేసింది. నిహారిక ప్రస్తుతం ఒక సినిమాని ఓకే చేసింది అని సమాచారం, అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి.