Friday, November 22, 2024
HomeCinemaNiharika: యూట్యూబర్ నిఖిల్ తో తన పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన నిహారిక కొణిదెల..

Niharika: యూట్యూబర్ నిఖిల్ తో తన పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన నిహారిక కొణిదెల..

Niharika : మెగా బ్రదర్ నాగ బాబు కూతురిగా నిహారిక కొణిదెల కి సోషల్ మీడియా మంచి గుర్తింపు ఉంది. ఈమె హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది కానీ పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. చేసిన ప్రతీ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో సినిమాలకు టాటా చెప్పేసి చైతన్య అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది . ‘నిశ్చయ్’ పేరిట జరిగిన ఈ వివాహ మహోత్సవానికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అయ్యింది(Niharika Relastionship With Youtuber). ఇప్పటికీ అవి చూస్తే మెగా అభిమానులకు కనుల పండుగ లాగా ఉంటుంది.

niharika-konidela

అంత ఘనంగా పెళ్లి చేసుకొని రెండేళ్లు కూడా పూర్తి కాకముందే చైతన్య తో విడాకులు తీసుకుంది నిహారిక. కారణం ఏమిటో తెలియదు కానీ, ఈమె విడాకులు తీసుకున్న విషయం సోషల్ మీడియా లో ఆమెపై మరియు మెగా ఫ్యామిలీ పై తీవ్రమైన నెగటివిటీ వచ్చేలా చేసింది. విడాకులు తీసుకున్న తర్వాత ఈమె తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో అప్లోడ్ చేసే ఫోటోలు చూసి మెగా అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఎంత విడాకులు తీసుకుంటే మాత్రం? ఇలా పొట్టి బట్టలు వేసుకొని మెగా ఫ్యామిలీ పరువు తీస్తావా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తూ ఉంటారు (Niharika Relastionship With Youtuber).

niharika-konidela-youtuber-nikhil

నిహారిక ఆ కామెంట్స్ ని పట్టించుకోకుండా, తనకి ఎలా ఉండాలని అనిపిస్తుందో అలా ఉంటూ వస్తుంది. ఈమధ్య కాలం లో ఈమె ఒక ప్రముఖ యూట్యూబర్ నిఖిల్ తో ఎక్కువగా తిరుగుతూ కనిపించింది (Niharika Relastionship With Youtuber). అతనితో చాలా క్లోజ్ గా ఉంటున్నట్టు కూడా ఇంస్టాగ్రామ్ లో ఫోటోలు అప్లోడ్ చేసేది. వీళ్లిద్దరి మధ్య ఉన్న ఆ బాండింగ్ ని చూసి అందరూ నిహారిక ఇతన్ని రెండవ పెళ్లి చేసుకోబోతుంది అంటూ కామెంట్స్ చేసేవాళ్ళు. అయితే రీసెంట్ గా అతని పుట్టిన రోజు సందర్భంగా నిహారిక పెట్టిన ఒక స్టోరీ తో అందరికీ క్లారిటీ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘నా చిట్టి తమ్ముడు నిఖిల్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

youtuber-nikhil

మొదట నాకు యాంకర్ గా పరిచయమయ్యావు, తర్వాత నటుడివి అయ్యావు, ఇప్పుడు నా తమ్ముడిగా మారావు, మనం కలిసి కెరీర్ లో చాలా దూరం ప్రయాణించాలి’ అంటూ ఒక స్టోరీ పెట్టింది. ఈ స్టోరీ తో వీళ్లిద్దరి మధ్య ఉన్నది అక్క తమ్ముళ్ల సంబంధం అని తేలిపోయింది. అలా సోషల్ మీడియా లో వచ్చే రూమర్స్ కి ఒకే ఒక్క పోస్ట్ తో చెక్ పెట్ట్టింది నిహారిక.

నిహారిక మొన్నటి వరకు వెబ్ సిరీస్ లలో నటించింది, అవి ఏవి బాగా నడవకపోవటంతో ఇప్పుడు మల్లి సినిమా లకు తిరిగి రావాలి అని అనుకుంటుంది. అన్నయ వరుణ్ తేజ్ పెళ్లి తరువాత తాను మల్లి షూటింగ్ మొదలు పెట్టబోతోంది అని తెలుస్తుంది. సినిమా వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts