Home Cinema నిహారిక సాయి ధరమ్ తేజ్ ముహూర్తం ఖరారు.. కార్డు కూడా షేర్ చేసిన నిహారిక..

నిహారిక సాయి ధరమ్ తేజ్ ముహూర్తం ఖరారు.. కార్డు కూడా షేర్ చేసిన నిహారిక..

మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మెగా కుటుంబం నుంచి వచ్చిన ఒక ఫెయిల్యూర్ నటి. మెగా కుటుంబం నుండి ఇప్పటికే చాల మంది నటులు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. కానీ అదృష్టం అందరిని వరించదు, అదే విధంగా నిహారికకు కూడా సినిమాలు కలిసి రాలేదు. తను ఎంచుకునే స్టోరీల వలనో లేదా తన వలనో ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు.

ఇక భర్త చైతన్య జొన్నలగడ్డతో విడాకులు తీసుకున్నప్పటి నుండి నిహారిక పేరు ఏదో ఒక వార్తతో వినిపిస్తూనే ఉంది. ప్రస్తుతం మల్లి సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వనుంది. నిహారిక ప్రస్తుతం ఒక తమిళ సినిమాలో లో హీరోయిన్ గా నటిస్తుంది. ఆహా లో మొన్నటి వరకు ఒక టాక్ షో కూడా చేసింది నిహారిక. కేవలం సినిమాలో నటించటమే కాదు తనకంటూ ఒక సొంత ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ దాని పేరు.

niharika-invites-sai-dharam-tej

ప్రస్తుతం వీరి బ్యానర్ పై ఒక సినిమా రానుంది. దానికి నామ కారణం చేసేందుకు సాయి ధరమ్ తేజ్ ఏప్రిల్ 9న స్పెషల్ గెస్ట్ గా రానున్నాడు. ఇక దీనికి సంబందించిన కార్డును నిహారిక సోషల్ మీడియా లో షేర్ చేసింది. అది చూసి మొదట్లో అందరూ పెళ్లి కార్డు అని అనుకున్నారు. కానీ అది కేవలం ఒక బ్యానర్ మాత్రమే. అందరూ ఇలా అనుకోవాలి అనే ఒక ప్రమోషన్ స్టంట్ లా చేసింది నిహారిక అంటూ మెగా ఫాన్స్ భావిస్తున్నారు.

Exit mobile version