Home Cinema ఆ స్టార్ హీరో కొడుకుతో సాయి ధరమ్ తేజ్ గర్ల్ ఫ్రెండ్ పెళ్లి..

ఆ స్టార్ హీరో కొడుకుతో సాయి ధరమ్ తేజ్ గర్ల్ ఫ్రెండ్ పెళ్లి..

ఆర్యన్ ఖాన్ ఈ పేరు మన సౌత్ ఇండస్ట్రీ ప్రేక్షకులకు పెద్దగా తెలియదు కానీ నార్త్ లో బాగా ఫేమస్. ఆర్యన్ ఖాన్ బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ కుమారుడు. ఈ మధ్య కాలంలో ఈ పేరు సోషల్ మీడియా లో తెగ విన్పిస్తుంది. మొదట్లో డ్రగ్స్ విషయంలో అందరికి తెలిసొచ్చింది ఈ పేరు ఇప్పుడు మంచి టాప్ హీరోయిన్ లతో డేటింగ్ చేస్తూ వార్తలెక్కాడు. ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం సినిమాలు నిర్మిస్తున్నాడు.

ఆర్యన్ ఖాన్ ఎపుడు ఏదో ఒక హీరోయిన్ తో డేటింగ్ లో ఉంటాడు, వారితో దిగిన ఫోటోలు మనం ఇప్పటికే ఎన్నో సార్లు చూసాము. ప్రస్తుతం ఆర్యన్ ఖాన్ టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ గర్ల్ ఫ్రెండ్ బ్రెజిలియన్ నటి లారీసా బోనేసితో ప్రేమలో ఉన్నాడు అని, అతిత్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు అని బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. అదేంటి సాయి ధరమ్ తేజ్ గర్ల్ ఫ్రెండ్ ని ఆర్యన్ ఖాన్ పెళ్లి చేసుకోవటం అను కుంటున్నారా .?

aryan-khan-larissa-bonesi

గతంలో హీరో సాయి ధరమ్ తేజ్ బ్రెజిలియన్ నటి అయిన లారీసా బోనేసితో ప్రేమలో ఉన్నట్లు ఆమెనే పెళ్లి కూడా చేసుకోవాలి అనుకుంటున్నాడు అని చాలా వార్తలు వచ్చాయి. కానీ మెగా కుటుంబం దీనికి అంగీకరించలేదు అని అందుకే పెళ్లి చేసుకోలేదు అని సమాచారం. మరి ఇప్పుడు ఆ నటి ఆర్యన్ ఖాన్ ని పెళ్లి చేసుకోబోతుంది అని వస్తున్న వార్తలు చూసి అభిమానులు ఆశ్చర్య పోతున్నారు.

Exit mobile version