Saturday, November 23, 2024
HomeCinemaNTR : రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న ఎన్టీఆర్.. అక్కడి నుండి ఎంపీ గా పోటీ..?

NTR : రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న ఎన్టీఆర్.. అక్కడి నుండి ఎంపీ గా పోటీ..?

NTR : జూ.ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే పీఎం కావడం ఖాయం. సంచలనంగా జ్యోతిష్యుడి కామెంట్స్ ఏ ఇండస్ట్రీలో నైనా సరే సక్సెస్ కావాలి అంటే టాలెంట్ ఒక్కటే సరిపోదు కాస్త అదృష్టం కూడా ఉండాలి. ఇదే నియమం సినిమాలకు కూడా వర్తిస్తుంది. అలా టాలెంట్ ఉన్న అదృష్టం లేకపోవడంతో చాలా మంది నటీనటులు వెండితెరకు దూరం అయ్యారు. అలాగే నందమూరి కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జూ.ఎన్టీఆర్ కు అదృష్టం బాగా కలిసొచ్చింది(NTR Politics). దీంతో చిన్న వయసులోనే స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్నాడు. మధ్యలో కొన్నాళ్లు కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసినా మళ్లీ సక్సెస్ బాట పట్టారు.

ntr

కొన్నాళ్లుగా తన కెరీర్ కు తిరుగు లేదని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కు సంబంధించిన ఓ వార్త విన్న ఆయన అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. ప్రముఖ జ్యోతిష్యులు ఎన్టీఆర్ జాతకాన్ని పరిశీలించి ఆయన రాజకీయాలకు వస్తే ఏం జరుగుతుందన్న విషయాన్న వెల్లడించారు. నిజానికి జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు రాజకీయాల్లోకి వస్తారా? (NTR Politics) ఎప్పుడెప్పుడు ఆయనను సీఎం చేస్తామా అన్నట్లుగా ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. అంతే కాదు టీడీపీకి నిజమైన వారసుడు ఆయనే అంటు పలుమార్లు వారు హల్చల్ చేసిన సంగతి తెలిసిందే.

junior-ntr

ఇప్పటికే అసలైన వారసుడు రాక కొసరోడు పండుగ చేసుకుంటున్నాడు అంటూ ఇప్పటికే ఏపీలో పలు ప్రాంతాల్లో పోస్టర్లు సైతం వెలిసిన సంగతి తెలిసిందే. ఎన్టీ రామారావు ను వెన్నుపోటు పొడిచిన వాడికి సపోర్టు చేసి ఆయన కుటుంబమే చంద్రబాబుకు అధికారాన్ని అప్పజెప్పటం ఎన్టీఆర్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. నిజమైన టీడీపీకి వారసుడు జూ.ఎన్టీఆర్ అన్న విషయాన్ని వైరల్ చేస్తున్నారు. ఓ ప్రముఖ జ్యోతిష్యుడు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా పీఎం అవుతారు అంటూ ఓ సంచలన విషయాన్ని బయటపెట్టారు.

jr-ntr

ప్రముఖ జ్యోతిష్యుడు తారక్ జాతకాన్ని పరిశీలించి ఎన్టీఆర్ గనుక రాజకీయాల్లోకి అడుగుపెడితే సీఎం ఏంటి పీఎం అయ్యే ఛాన్స్ ఉంది. ఆయన జాతకంలో రాజయోగం ఉంది. కానీ సీఎం కావాలంటే ఆయన కృషి పట్టుదల ఎంతో ఉండాలి. ఈయన గనుక కష్టపడితే కచ్చితంగా సీఎం అవ్వగలరు. రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా తాత కన్నా సంచలనాలు సృష్టిస్తాడు. అయితే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో చాలామంది ఎన్టీఆర్ అభిమానులు ఆయనను రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు. అయితే రాబోయే ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ టీడీపీ తరఫున ప్రచారానికి దూరంగానే ఉంటారు.

అయితే ఆయనకు ఆసక్తి ఉన్నా కొన్ని పరిస్థితుల కారణంగా రాజకీయాల్లోకి రాలేకపోతున్నట్లు తెలుస్తోంది. కానీ కచ్చితంగా భవిష్యత్తులో ఎన్టీఆర్ టీడీపీని హస్తగతం చేసుకుని సీఎం అవ్వడం గ్యారంటీ.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts