Saturday, November 23, 2024
HomeCinemaNTR-Nithya: ఎన్టీఆర్ కి తన భార్య తరువాత ఈ హీరోయిన్ ఏ అన్ని అంట.. ఎవరంటే..

NTR-Nithya: ఎన్టీఆర్ కి తన భార్య తరువాత ఈ హీరోయిన్ ఏ అన్ని అంట.. ఎవరంటే..

NTR-Nithya: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నేటి తరం మాస్ హీరో గా జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నూనూగు మీసాలు కూడా రాని వయస్సులోనే ఇండస్ట్రీ లో మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న ఏకైక ఇండియన్ హీరో ఆయన. ఆ తర్వాత హిట్టు/ ఫ్లాప్ తో సంబంధం లేకుండా అదే రేంజ్ క్రేజ్/ ఫాలోయింగ్ ని మైంటైన్ చేస్తూ ఇండస్ట్రీ లో కొనసాగుతున్నాడు ఎన్టీఆర్ (NTR Likes Nithya Menen). ఇక గత ఏడాది విడుదలైన RRR చిత్రం తో పాన్ వరల్డ్ రేంజ్ క్రేజ్ ని సంపాదించుకొని హాలీవుడ్ నటీనటులు, టెక్నీషియన్స్ తో కూడా శబాష్ అనిపించుకున్నాడు. ప్రస్తుతం ఆయన కొరటాల శివ తో కలిసి దేవర అనే చిత్రం లో నటిస్తున్నాడు.

ntr-likes-nithya-menen

ఈ సినిమా షూటింగ్ బుల్లెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. ఇది ఇలా ఉండగా ఎన్టీఆర్ ఒకరి నటనని మెచ్చుకున్నాడు అంటే అది ఎవరికైనా ఒక గొప్ప రివార్డు లెక్కే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయనే ఒక గొప్ప నటుడు, ఒక గొప్ప నటుడు మరో నటుడిని కానీ/నటిని కానీ పొగిడాడు అంటే చాలా స్పెషల్ అని అర్థం. అలా టాలీవుడ్ లో ప్రముఖ హీరోయిన్ నిత్యా మీనన్ అంటే ఎన్టీఆర్ కి ఎంతో ఇష్టం అట. అలనాటి సావిత్రి గారి నటన తర్వాత హీరోయిన్స్ లో నేటి తరం లో సహజత్వం ఉట్టిపడే రేంజ్ నటనని కేవలం నిత్యామీనన్ లో మాత్రమే చూశానని, ఆమెతో నటించడం నాకు ఎంతో సౌకర్యం గా ఉందని ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్.

nithya-menen

అంతే కాదు తన భార్య లక్ష్మీ ప్రణతి ముందు కూడా నిత్యా మీనన్ ని పొగడ్తలతో ముంచి ఎత్తేవాడట (NTR Likes Nithya Menen). నా ముందు వేరే అమ్మాయిని అలా పొగడొద్దు అని ఎన్టీఆర్ తో గొడవలు కూడా పెట్టుకుందట ప్రణతి. వీళ్లిద్దరు కలిసి జనతా గ్యారేజ్ అనే చిత్రం లో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయం లో ఎన్టీఆర్ సమంత కంటే కూడా ఎక్కువగా నిత్యా మీనన్ తోనే క్లోజ్ గా ఉండేవాడట. అప్పట్లో సమంత దీనిపై సరదాగా ఆటపట్టిస్తూ వీడియో లు కూడా సోషల్ మీడియా లో అప్లోడ్ చేసేది. మళ్ళీ నిత్యామీనన్ తో కలిసి నటించే అవకాశం వస్తే అసలు వదులుకోనని.

actress-nithya-menen

ఆమెతో నటించే ఛాన్స్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తున్నాను అంటూ ఎన్టీఆర్ ఆ ఇంటర్వ్యూ లో చెప్పడం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. నిన్ననే నిత్య ఇంట్లో చిన్న విషాదం కూడా చోటు చేసుకుంది. తాను ఎంతో ప్రేమించే తన అమ్మమ్మ చనిపోయారు, దీనితో నిత్యా మీనన్ పట్టలేని దుఃఖంలో మునిగిపోయింది. తాను దైర్యం గా ఉండాలని ఫాన్స్ మరియు స్నేహితులు ఆమెను కోరారు. కొద్దిరోజులు విరామం తీసుకుని మల్లి సినిమాలు మొదలు పెట్టబోతోంది నిత్యా.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts