Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హీరోగా పలు భారీ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతమైన డిమాండ్ ఉన్న హీరోల్లో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. ఇప్పుడు రోజుకు రెండు కోట్లు రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. దీంతో మన తెలుగులో అత్యధిక పారితోషికం తీసుకునే అతికొద్ది మంది హీరోల్లో పవన్ ఒకడు అయ్యాడు. అయితే గత ఐదేళ్లలో పవన్ కళ్యాణ్ ఎంత సంపాదించాడు? ఎంత పన్నులు కట్టారో ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకుందాం.
అయితే గత ఐదేళ్లలో పవన్ రూ.114.76 కోట్లు సంపాదించారని రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు ఈ వార్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఐదేళ్లలో మొత్తం రూ.73.92 కోట్లు పన్నులు చెల్లించగా, రూ.20 కోట్లకు పైగా విరాళాలు అందజేసినట్లు తెలిపారు. పవన్‌కు వివిధ బ్యాంకులతో పాటు కొంతమంది వ్యక్తుల వద్ద రూ.64.26 కోట్ల అప్పులు ఉన్నాయి. ఈ ఐదేళ్లలో పవన్ కళ్యాణ్ ఆదాయ, ఖర్చుల లెక్కలు ఇలా ఉన్నాయి.
బహుశా ఈ కొన్ని నెలల్లో ఈ ఆదాయంలో ఎక్కువ భాగం OG మరియు ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల నిర్మాతల నుండి వచ్చింది. లేకుంటే ఈ 114 కోట్ల కంటే తక్కువ వచ్చేది. ఏదిఏమైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలేచ్షన్స్ తరువాత మల్లి షూటింగ్ కు హాజరవుతాడని సమాచారం. ఈయన OG సినిమా పై బారి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా బారి విజయం సాధించాలని పవన్ అభిమానులు కోరుకుంటున్నారు.