Pawan Kalyan Disease: టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆయన, ఏనాడు కూడా అన్నయ్య ని అనుసరించకుండా, తన సొంత స్టైల్ లో సినిమాలు చేసుకుంటూ యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించి నేడు ఈ స్థాయిలో ఉన్నాడు. ఒకపక్క శ్రద్దగా సినిమాలు చేసుకుంటూనే మరోపక్క రాజకీయాల్లో క్షణకాలం తీరిక లేకుండా బిజీ గా ఉన్నాడు. రీసెంట్ గానే ఆయన ‘బ్రో ది అవతార్’ చిత్రాన్ని విడుదల చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే.
ఈ సినిమా రన్నింగ్ లో ఉన్న సమయం లోనే ఆయన ‘వారాహి విజయ యాత్ర’ మూడవ విడత టూర్ ని ప్రారంభించాడు. అలా రెండు పడవల మీద ఆయన ప్రయాణం ని విజయవంతంగా కొనసాగిస్తూ ఉన్నాడు. ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ గురించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ఒకటి బయటపడింది. అదేమిటంటే పవన్ కళ్యాణ్ కి చిన్నతనం నుండి ఆస్తమా సమస్య ఉంది(Pawan Kalyan Disease). ఈ సమస్య కారణంగా పవన్ కళ్యాణ్ ఇంట్లో కంటే కూడా ఎక్కువగా హాస్పిటల్ లోనే ఉండేవాడు. చిన్నతనం లో ఈ ఆశామా సమస్య వల్ల స్కూల్ కి కూడా వెళ్ళేవాడు కాదట పవన్ కళ్యాణ్.
అందువల్ల ఆయనకీ పెద్దగా స్నేహితులు కూడా పరిచయం అవ్వలేదు. ఒకానొక సమయం లో ఈ ఆస్తమా కారణం గా ఎంతో డిప్రెషన్ కి గురై ఆత్మహత్య కూడా చేసుకోవాలని అనుకున్నాడట. కానీ ఆ సమయం లోనే ఆయన పుస్తకాలను చదవడం అలవాటు చేసుకున్నాడు. ఆ అలవాటు ఉండడం వల్ల పవన్ కళ్యాణ్ చాలా తొందరగానే ఈ డిప్రెషన్ నుండి బయటపడ్డాడట. ఈ విషయాన్నీ స్వయంగా పవన్ కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్నీ తెలుసుకొని ఆయన అభిమానులు కంగారు పడుతూ ఆరోగ్యం జాగ్రత్త అన్నయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇకపోతే పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘OG’ కి సంబంధించిన టీజర్ ని విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ రీసెంట్ గానే అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించి విడుదల చేసిన పోస్టర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం పై అభిమానులు ఏ రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారో చెప్పనక్కర్లేదు. చూడాలి మరి ఈ సినిమా తో పవన్ కళ్యాణ్ ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొడుతాడు అనేది. పవన్ కళ్యాణ్ ఫాన్స్ మాత్రం ఓజి సినిమా రిలీజ్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.