Home Cinema Pooja Hegde : బాయ్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకోబోతున్న పూజ హెగ్డే.. వైరల్ అవుతున్న...

Pooja Hegde : బాయ్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకోబోతున్న పూజ హెగ్డే.. వైరల్ అవుతున్న న్యూస్..

Pooja Hegde : పూజా హెగ్డే అంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరికి సుపరిచితురాలు. అయితే ఇటీవల ఇండస్ట్రీలో ఈమె నటించిన రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ, DJ, అలవైకుంటపురంలో, అరవింద సమేత, మహర్షి, గద్దల కొండ గణేష్ మరియు ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి సినిమాలు హిట్ అయ్యాయి. దాంతో ఈ హీరోయిన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అయ్యింది. అయితే ఆ తర్వాత అదృష్టం తలుపు తట్టకముందే దురదృష్టం వచ్చిందంటూ ఆమె చేసిన సినిమాలన్నీ పరాజయం పాలయ్యాయి.

ప్రస్తుతం ఈ హీరోయిన్ అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. అయితే ఇటీవల చాలా మంది హీరోయిన్లు ఒకరి తర్వాత మరొకరు పెళ్లి చేసుకుంటూ తమ వ్యక్తిగత జీవితాన్ని మెరుగుపరుచుకుంటూ సినిమా జీవితాన్ని కాపాడుకుంటున్నారు. అయితే తాజాగా, పూజా హెగ్డే తన జీవితంలో కూడా సంచలన నిర్ణయం తీసుకుంది అంటూ ఓ వార్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పూజ పెళ్లి చేసుకుని, ఆపై చిత్ర పరిశ్రమలో విజయం సాధించాలని ప్లాన్ చేస్తునట్టు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.

pooja-hegde-marriage-news-is-all-over-internet

గత కొన్ని రోజులుగా, బాలీవుడ్ సీరియల్ నటుడు రోహన్ మెహ్రాతో ప్రేమలో ఉన్న పూజా హెగ్డే, ఆమె అతనితో చాలాసార్లు కనిపించిన ఫోటోలు మరియు వీడియోలతో మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె తన కుటుంబానికి కూడా రోహన్ మెహ్రాను కూడా పరిచయం చేసింది మరియు వారి ప్రేమ గురించి మాట్లాడింది. అయితే తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం ప్రకారం వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు అంట.

Exit mobile version