Poorna : అవును, అవును 2, అదుగో, లడ్డూబాబు వంటి చిత్రాల్లో నటించిన ముద్దుగుమ్మ నటి పూర్ణ తెలుగు వారికి సుపరిచితురాలు. ఈ అమ్మడు హారర్ సినిమాలలో ఎక్కువ కనిపించింది. అయితే ఈమె ఇటీవల పెళ్లి చేసుకుని కొడుకు పుట్టడంతో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తోంది. ఆమె అకండ, దసరా, గుంటూరు కారంలో కూడా నటించింది. ఇదిలా ఉండగా, నటి పూర్ణ గురించి సోషల్ మీడియాలో ఓ వార్తా వైరల్ అవుతుంది. అదేంటో మనం ఇక్క తెలుసుకుందాం పదండి.
ఇటీవల నటుడితో పూర్ణ ఎఫైర్ నడుపుతోందని ఓ సెన్సషనల్ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. రీసెంట్ గా మిస్ వైజాగ్ టైటిల్ గెలిచి అందరి దృష్టిని ఆకర్షించిన మోడల్ నక్షత్ర తన భర్త తనను మోసం చేశాడంటూ మీడియాకు ఎక్కి ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. తన భర్త హీరోయిన్లతో అక్రమసంబంధాలు పెట్టుకుని తనను చిత్రహింసలకు గురిచేస్తున్నాడని వీధిలో హంగామా చేసింది. అయితే తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ నా భర్తకు చాలా మంది హీరోయిన్లతో ఎఫైర్లు ఉన్నాయి.
హీరోయిన్ పూర్ణతో కలిసి బ్యాక్ డోర్ చిత్రంలో నా భర్త తేజ నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో పూర్ణ నాతో డేట్ చేయమని నా భర్తను కోరింది అంట. ఈ విషయాన్ని తేజ స్వయంగా ఇంటికి వచ్చి నాతో చెప్పాడు. నేను వెంటనే ఆ చిత్ర దర్శకుడికి ఫోన్ చేసి విషయం చెప్పాను. కానీ దర్శకుడు అలాంటిదేమీ లేదు, మీ భర్త మీ తో అబద్ధాలు చెబుతున్నాడు అని చెప్పారట. ఈ విషయం నక్షత్ర మీడియాతో చెప్పడంతో పూర్ణ పేరు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.