Home Cinema అల్లు అర్జున్ కి బర్త్ డే విషెస్ చెప్పిన పవన్ కళ్యాణ్.. టచ్ చేసావ్ బాబాయ్...

అల్లు అర్జున్ కి బర్త్ డే విషెస్ చెప్పిన పవన్ కళ్యాణ్.. టచ్ చేసావ్ బాబాయ్ అంటూ అల్లు అర్జున్ రిప్లై..

powerstar-pawan-kalyan-birthday-wishes-to-allu-arjun

Allu Arjun Birthday : ఈరోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు. ఈరోజు మొత్తం ఇదే ట్రెండ్ నడుస్తుంది. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఇండస్ట్రీ నుండి చాల మంది సెలబ్రిటీస్ అల్లు అర్జున్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇదే క్రమంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అల్లు అర్జున్ కి విషెస్ తెలియచేసారు. “హ్యాపీ బర్త్ డే బన్నీ” అంటూ పోస్ట్ చేసారు. దానికి అల్లు అర్జున్ స్పందించి “థాంక్ యు వెరీ మచ్ బాబాయ్, టచ్ చేసావ్” అంటూ రిప్లై ఇచ్చాడు. ఇక అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ అయింది పుష్ప 2 టీజర్. ఇప్పుడు నెట్టింట ఇదే హాట్ టాపిక్.

Exit mobile version