Prabhas : సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తమ అభిమానులకు వీరి జీవితాల గురించి అప్డేట్స్ ఇస్తుంటారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, వారి అభిమానులకు అప్పుడప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుపుతారు. ఇలా సెలబ్రిటీలు వారి అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో పెట్టిన పోస్ట్‌లు సెకన్లలో వైరల్ అవుతాయి. అయితే తాజాగా అలాంటి ఒక పోస్ట్‌ని ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.
రెబల్ స్టార్ ప్రభాస్ తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ చూసిన చాలా మంది నెటిజన్లు రకరకాల ఊహాగానాలు చేశారు. ఇక ప్రభాస్ తన సోషల్ మీడియా ఖాతాలో చేసిన పోస్ట్ ఏంటో మనం ఇక్కడ తెలుసుకుందాం పదండి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఇలా రాసాడు. “డార్లింగ్స్, నా జీవితంలోకి ఒక ప్రత్యేక వ్యక్తి వస్తున్నారు, మీరు వేచి ఉండండి” అని రాశారు.
ఈ పోస్ట్ ఇంటర్నెట్లో వైరల్ కావడంతో, ప్రభాస్ జీవితంలోకి అమ్మాయి వస్తుంది అని తన అభిమానులు అనుకుంటున్నారు. అయితే ప్రభాస్ త్వరలో పెళ్లి చేసుకోనుందని ప్రభాస్ పెద్దమా శ్యామలాదేవి గారు ఇటీవల తెలిపారు.అయితే ఈ పోస్ట్ చూసిన వారంతా ప్రభాస్ పెళ్లికి ఇది శుభ ముహూర్తం అని కామెంట్లు పెడుతున్నారు. ఈ వార్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ప్రభాస్ చేసిన పోస్ట్ తన పెళ్లి గురించా కదా అని తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాలిసిందే.