Rajamouli : ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో దేశ వ్యాప్తంగా మార్మోగుతున్న పేరు ఎస్ ఎస్ రాజమౌళి. చేసిన ప్రతి సినిమా ఓ యజ్ఞంలా చేస్తూ అపజయమే తెలియకుండా దూసుకుపోతున్నారు. ప్రస్తుతం భారత దేశంలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న దర్శకుడు జక్కన్నే. తెలుగు సినిమాని అంతర్జాతీయ కీర్తిపతాకన చేర్చిన ఘనత జక్కన్న సొంతం. అఫ్ కోర్స్ ఇండస్ట్రీకి చాలామంది దర్శకులు వచ్చారు. ఎన్నో హిట్ సినిమాలు ఇచ్చారు(Rajamouli Becoming Father). కానీ తెలుగు సినిమాకు ఆస్కార్ తీసుకొచ్చిన ఘనత మాత్రం రాజమౌళికే దక్కింది. ఆయన ఇప్పటివరకు ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లే.
ఒక్క సినిమా కూడా ఫ్లాప్ కాలేదు. దీనిని బట్టి రాజమౌళి సినిమాను ఎంతశ్రద్ధగా తీస్తారో. అలా తీస్తారు కనుకే ప్రతి సినిమా ఏళ్లకు ఏళ్లు సమయం పడుతుంది. సినిమాలపరంగా టాప్ పొజిషన్లో ఉండే రాజమౌళి.. తన ఫ్యామిలీ పరంగా కూడా అంతే టాప్ పొజిషన్లో ఉంటారు. రాజమౌళి రమా అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. రమాకు అంతకు ముందే పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ రాజమౌళికి ఇదే మొదటి పెళ్లి. రమాకు తన మొదటి భర్తతో కార్తికేయ పుట్టిన తర్వాత వచ్చిన గొడవల కారణంగా డివోర్స్ తీసుకున్నారు. రాజమౌళికి రమా అంటే చాలా ఇష్టం.
అందుకనే కార్తికేయను తన బిడ్డగా ఒప్పుకుని మరీ పెళ్లిచేసుకున్నాడు. అయితే పెళ్లి తర్వాత రాజమౌళి జంట బిడ్డలను కనాలని అనుకోలేదు. ఓ అనాథ బిడ్డను దత్తతకు తీసుకున్నారు(Rajamouli Becoming Father). తన పేరే “మయూక”. ఎప్పటికప్పుడు రాజమౌళి ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. కాగా తాజాగా రాజమౌళి మరో మంచి పని చేయబోతున్నాడంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది. రాజమౌళి చేసే పనికి తన అభిమానులు, ప్రజలు మెచ్చుకుంటున్నారు. తనను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఆయన మరో బిడ్డకు మంచి లైఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నారట.
అంటే ఇంకొక అమ్మాయిని ..దత్తత తీసుకోబోతున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మొదటి నుంచి సమాజ సేవ పట్ల ఎంతో బాధ్యతను కనబరుస్తుంటారు రాజమౌళి. ఆయనకు అనాథ పిల్లల పట్ల అమితమైన ప్రేమ ఉందని సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. దీని కారణంగానే ఆయన మరో బిడ్డను దత్తత తీసుకొని ఆమెకు లైఫ్ ఇవ్వాలని అనుకుంటున్నారట. ఈ కాలంలో అందరూ కొడుకుల కోసం తాపత్రయపడుతుంటే రాజమౌళి మాత్రం ఆడపిల్లలకు లైఫ్ ఇవ్వాలనుకోవడం నిజంగా గ్రేట్.