Rajamouli: టాలీవుడ్ లో మాత్రమే కాదు, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఒక్క అపజయం కూడా లేకుండా ఇండస్ట్రీ లో ఏకచక్రాధిపత్యం చేసిన డైరెక్టర్ ఎవరు అంటే అందరూ చెప్పే మొదటి పేరు రాజమౌళి. ఎందుకంటే మరో డైరెక్టర్ ఆయనకీ దరిదాపుల్లో కూడా లేదు (Rajamouli Loss in movie). ఎంత గొప్ప డైరెక్టర్ కి అయినా ఎదో ఒక సినిమా ఫ్లాప్ రావడం అనేది సర్వసాధరణం, కానీ రాజమౌళి విషయం లో మాత్రం అది జరగలేదు. కారణం ఆయనకీ ఉన్న విజన్, ఆయన విజన్ లో ఉన్నటువంటి అవుట్ పుట్ వెండితెర మీద మక్కీకి మక్కి తెరకెక్కించేవరకు ఆయన నిద్రపోడు.
పకడ్బందీగా వచ్చేందుకు ఆయన ఎన్ని టేక్స్ అయినా తీసుకుంటాడు, అందుకే ఆయన సినిమా ఏళ్ళ తరబడి షూటింగ్స్ జరుగుతుంటాయి. అలా చెక్కుతాడు కాబట్టే ఆయనని అందరూ జక్కన అని పిలుస్తుంటారు. అయితే రాజమౌళి కెరీర్ లో ఒక సినిమా బయ్యర్స్ కి భారీ నష్టాలను తెచ్చిపెట్టింది అంటే ఎవ్వరూ నమ్మలేరు. కానీ నమ్మాలి, ఎందుకంటే అది నిజం కాబట్టి. జూనియర్ ఎన్టీఆర్ తో ‘సింహాద్రి’ వంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని తీసిన తర్వాత రాజమౌళి యంగ్ హీరో నితిన్ తో కలిసి ‘సై’ అనే చిత్రం చేసాడు. అప్పట్లో ఈ సినిమాలోని రగ్బీ గేమ్ ప్రేక్షకులను చాలా ఆకట్టుకుంది.
మన తెలుగు ఆడియన్స్ కి అసలు ఇలాంటి గేమ్ అనేది ఒకటి ఉందని తెలిసింది ఈ చిత్రంతోనే. 8 కోర్ట్ అరూపాయిల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో 12 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించింది (Rajamouli Loss in movie). రాజమౌళి ముందు సినిమా సింహాద్రి 25 కోట్ల రూపాయిల షేర్ ని సాధించింది, ఆ చిత్రం విజయం తో పోలిస్తే ఇది చాలా తక్కువ, కానీ కమర్షియల్ కి నిర్మాతకి లాభాలు తెచ్చిపెట్టింది. కానీ చాలా ప్రాంతాల్లో బయ్యర్స్ కి మాత్రం ఈ చిత్రం నష్టాలనే మిగిలించింది, అందుకే ఈ సినిమాని ట్రేడ్ పండితులు నిర్మాతలకు సక్సెస్ ఫుల్ ఫిలిం,కానీ బయ్యర్స్ కి మాత్రం ఫ్లాప్ అని అంటుంటారు.
కానీ రాజమౌలి తీసిన సినిమాల్లో టేకింగ్ పరంగా టాప్ 3 బెస్ట్ మూవీస్ లో ఈ చిత్రం కచ్చితంగా నిలుస్తుందని చెప్పొచ్చు, కొత్తరకం కాన్సెప్ట్ తో రావడం వల్ల మాస్ ఆడియన్స్ ఈ సినిమాని పెద్దగా ఆదరించకపోయియుండొచ్చు, అందుకే ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది అని విశ్లేషకుల అభిప్రాయం. రాజమౌళి డ్రీం ప్రాజెక్ట్ అయిన మహాభారతం కూడా అతిత్వరలో మొదలు పెడదాం అనుకుంటున్నారు అని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఆదిపురుష్ దెబ్బతో వొళ్ళు దెగ్గర పెట్టుకుని చేస్తే బాగుంటుంది అని కొందరు ఫాన్స్ కోరుకుంటున్నారు.