Ram Charan: మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగిడుపెట్టిన రామ్ చరణ్ తొలిచిఎన్మా చిరుత తోనే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా ఆరోజుల్లో ఒక ప్రభంజనం సృష్టించింది. ముఖ్యంగా రామ్ చరణ్ వేసిన డ్యాన్సులు, ఫైట్స్ అభిమానులకు విపరీతంగా నచ్చేసింది. చిరంజీవి కొడుకు అంటే ఎలా ఉండాలని కోరుకున్నారో అంతకు పదిరెట్లు ఎక్కువగా తనని తాను నిరూపించుకున్నాడు రామ్ చరణ్(ram charan first remuneration). ఈ సినిమాలోని అతని అద్భుతమైన నటన చూసి, డైరెక్టర్ రాజమౌళి ఏకంగా రెండవ సినిమాతోనే ‘మగధీర’ లాంటి బరువైన రోల్ ని వేయించాడంటే రామ్ చరణ్,
కెపాసిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక నేడు రామ్ చరణ్ ఏ స్థాయిలో ఉన్నాడో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. #RRR సినిమాతో పాన్ వరల్డ్ స్టార్ గా గుర్తింపుని దక్కించుకొని, నేడు వంద కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకునే రేంజ్ కి ఎదిగాడు. ఇదంతా పక్కన పెడితే రామ్ చరణ్ తన మొదటి సినిమా రెమ్యూనరేషన్ ని ఏమి చేసాడు.?(ram charan first remuneration) ఇంట్లో వాళ్లకు ఇచ్చాడా లేదా? లేక తన సొంత ఖర్చులకు ఆ డబ్బులను వాడుకున్నాడా? ఇలాంటివి తెలుసుకోవడానికి అభిమానులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు.
అయితే రీసెంట్ గా రామ్ చరణ్ ఇచ్చిన ఒకఇంటర్వ్యూ లో తన మొదటి సినిమాకి ఇచ్చిన రెమ్యూనరేషన్ ని ఏమి చేసాడో చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘నాకు మొదటి నుండి హ్యాండ్ వాచీలంటే చాలా ఇష్టం, ఎక్కడికి వెళ్లినా నేను కొనే మొట్టమొదటి గ్యాడ్జెట్ అదే. నాకు పాటెక్ వాచ్ అంటే ప్రాణం, నా మొదటి సినిమా చిరుత కి వచ్చిన రెమ్యూనరేషన్ ని ఆ వాచ్ కొనడానికే వాడాను. కానీ ఇప్పుడు కరోనా సమయం లో బుక్ చేసుకున్న ఈ వాచ్ అంటే తెగ ఇష్టం. మిలిటరీ రంగులో ఉన్న వాచ్ కొరియర్ లో ఇంటికి రాగానే దానిని చూసి ఎంతో సంతోషించాను’ అంటూ చెప్పుకొచ్చాడు రామ్ చరణ్.
ఇప్పుడు ఇది సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇకపోతే రామ్ చరణ్ ప్రస్తుతం సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో ‘గేమ్ చేంజర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది, వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. రామ్ చరణ్ మాత్రం ఇంకా సినిమా షూటింగ్ కి తిరిగిరాలేదు, ఇప్పుడు అప్పుడే వచ్చేలా కూడా కనిపించటం లేదు. ఇటీవలే పుట్టిన తన కూతురు క్లిన్ కారా కొణిదెలతో ఇంట్లోనే ఉంటూ ఆడుకుంటూ సమయం గడిపేస్తున్నాడు చరణ్.